నిన్న ఈటల.. నేడు రసమయి సంచలన వ్యాఖ్యలు…!

మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఈటల రాజేందర్ కు సంబంధించి ప్రస్తుతం తెలంగాణలో పలు వార్తలు షికార్లు చేస్తున్న క్రమంలో ఎమ్మెల్యే రసమయి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన టీచర్స్ డే వేడుకల్లో మాట్లాడుతూ ఈటల రాజేందర్ కు, తనకు నిజాలు మాట్లాడటమే వచ్చునంటూ బాలకిషన్ తెలిపారు. తాము కడుపులో ఏమీ దాచుకోమని.. ఉద్యమంలో కొట్లాడినోళ్లమని.. తమకు అబద్దాలు రావంటూ రసమయి మాట్లాడుతుండగా.. మధ్యలో […]

నిన్న ఈటల.. నేడు రసమయి సంచలన వ్యాఖ్యలు...!

Edited By:

Updated on: Sep 05, 2019 | 7:51 PM

మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఈటల రాజేందర్ కు సంబంధించి ప్రస్తుతం తెలంగాణలో పలు వార్తలు షికార్లు చేస్తున్న క్రమంలో ఎమ్మెల్యే రసమయి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన టీచర్స్ డే వేడుకల్లో మాట్లాడుతూ ఈటల రాజేందర్ కు, తనకు నిజాలు మాట్లాడటమే వచ్చునంటూ బాలకిషన్ తెలిపారు. తాము కడుపులో ఏమీ దాచుకోమని.. ఉద్యమంలో కొట్లాడినోళ్లమని.. తమకు అబద్దాలు రావంటూ రసమయి మాట్లాడుతుండగా.. మధ్యలో కల్పించుకున్న ఈటల నవ్వుతూ ‘జాగ్రత్తగా మాట్లాడు’ అంటూ సూచించారు. ‘ఏమీ కాదన్నా’ అనుకుంటూనే రసమయి బాలకిషన్ తన సహజశైలిలో ప్రసంగం కొనసాగించారు. ఆ తర్వాత మాట్లాడిన ఈటల.. రసమయికి కాస్త స్వేచ్ఛ ఎక్కువ అని… అయితే రసమయి మాటలతో తాను ఏకీభవిస్తానంటూ మళ్ళీ ఈటల చెప్పుకు రావడంతో.. ఇప్పుడు ఈ ఇద్దరి మాటలు సంచలనంగా మారాయి.

కాగా… కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజలకు వద్దంటే నీళ్లు వస్తున్నాయని, కాళేశ్వరంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుపై 50శాతం ఒత్తిడి తగ్గుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీ నేతలు అపోహలు సృష్టిస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఈశ్వర్‌వివరించారు.