చాలా మంది పాస్‌వర్డ్స్ మర్చిపోతామని ఎంతో ఈజీగా ఉండే సీక్రెట్ కోడ్స్‌ని పెడుతూంటారు. మన ఫోన్ నుంచి మొదలు కొని ఏ ఇతర టెక్నాలజీకి సంబంధించినదైనా పాస్‌వర్డ్‌లు కీలకమైన పాత్రను పోషిస్తాయి. ప్రస్తుతమున్న డిజిటల్ రంగంలో అవి మరీ ముఖ్యం కూడా. అందులోనూ బ్యాంకింగ్ తరహా లావాదీలకైతే ఇవి తప్పనిసరని చెప్పవచ్చు. ఎంత కఠినతరహావి పెట్టినా.. సైబర్ క్రైమ్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.
అయితే.. ఇప్పటికీ కొంతమందికి పాస్‌వర్డ్స్ మీద ఆవశ్యత తెలియడంలేదు. దీనిపై ఓ ప్రముఖ సంస్థ పరిశోధనలు చేయగా ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. చాలా మంది చాలా ఈజీగా ఉండే పాస్‌వర్డ్స్‌ని పెడుతున్నట్టు ఈ సంస్థ తెలిపింది. అంతేకాకుండా వాటిని లిస్ట్‌గా కూడా తీసిపెట్టారు.
2019 ఏడాదిలో అంత్యంత చెత్త పాస్‌వర్డ్స్ లిస్ట్ ఇదే:
వీటిని కనుగొనేందుకు హ్యాకర్లే అవసరం లేదని, చిన్నపిల్లలు సైతం వీటితో సులభంగా ఓపెన్ చేయవచ్చు. కాబట్టి ఇప్పటికైనా.. పాస్‌వర్డ్స్ ఎంతో కీలకమైనవని.. వాటిని ఎంతో కఠినంగా పెట్టుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పాస్‌వర్డ్స్‌లో ఇంగ్లీషులోని పెద్ద, చిన్న అక్షరాలు, నెంబర్స్, చిహ్నాలు ఉండాలని వారు సూచిస్తున్నారు. ఒకవేళ పాస్‌వర్డ్‌లు మర్చిపోతున్నాం అనుకునేవాళ్లు ‘పాస్‌వర్డ్ మేనేజర్’ని వాడటం మంచిది.