Tokyo Olympics 2021 Will Be Cancelled: కరోనా మహమ్మారి అన్ని రంగాల మీద ప్రభావం చూపినట్లే క్రీడా రంగంపై కూడా చూపించింది. అయితే ఇప్పుడిప్పుడే క్రికెట్ వంటి క్రీడలు మళ్లీ మొదలవుతున్నాయి. ఈ తరుణంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఒలింపిక్స్ గేమ్స్ నిర్వాహణ విషయం ప్రస్తుతం చర్చకు వచ్చింది. నిజానికి 2020 ఒలింపిక్స్ టోక్యోలో జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడింది. జూలై 23న ప్రారంభంకావాల్సిన గేమ్స్‌ను కరోనా కారణంగా వాయిదా వేశారు.
ఇదిలా ఉంటే ఈ ఏడాది కూడా ఒలింపిక్స్ గేమ్స్‌పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. ఈసారి ఒలింపిక్స్ అతిథ్యం ఇస్తున్న జపాన్ క్రీడలను రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోందని వార్తలు వస్తున్నాయి. జపాన్‌లో ప్రస్తుతం కరోనా కేసులు నమోదవుతుండడం, అంతేకాకుండా ఆ దేశస్థులు కూడా గేమ్స్ జరపొద్దనే అభిప్రాయం వ్యక్తం చేస్తుండడంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి ఒలింపిక్స్ రద్దు చేస్తూనే.. 2032లో మరోసారి గేమ్స్ నిర్వహణ హక్కులు సొంతం చేసుకునే ప్రయత్నంలో జపాన్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఒలింపిక్స్ రద్దు వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.
Also Read: ఇక్కడ క్రికెట్ అంటే ఆట మాత్రమే కాదు.. అంతకన్నా ఎక్కువ అంటున్న.. ఇండియన్ మాజీ డాషింగ్ ఓపెనర్..