Fuel Price: ఈరోజు పెట్రోల్‌, డీజీల్‌ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..? కొన్ని చోట్ల స్వల్ప మార్పులు..

|

Jan 13, 2021 | 4:56 AM

Today Petrol, Diesel Price: పెట్రోల్‌, డీజీల్‌ ధరల్లో స్థిరత్వం కొనసాగుతోంది. మంగళవారంతో పోలీస్తే బుధవారం కూడా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేవు. అయితే..

Fuel Price: ఈరోజు పెట్రోల్‌, డీజీల్‌ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..? కొన్ని చోట్ల స్వల్ప మార్పులు..
Follow us on

Today Petrol, Diesel Price: పెట్రోల్‌, డీజీల్‌ ధరల్లో స్థిరత్వం కొనసాగుతోంది. మంగళవారంతో పోలీస్తే బుధవారం కూడా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేవు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం స్వల్పంగా హెచ్చు, తగ్గులు కనిపించాయి. ఇక బుధవారం పెట్రోల్‌, డీజీల్‌ ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూసేయండి..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 87.59గా ఉండగా.. డీజీల్‌ ధర 81.17గా నమోదైంది. ఇక వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.87.14 కాగా డీజీల్‌ 80.74గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే.. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 90.48 ఉండగా డీజీల్‌ రూ. 83.58గా నమోదైంది. గుంటూరులో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ. 90.48 కాగా.. డీజీల్‌ ధర రూ. 83.58గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికొస్తే లీటర్‌ పెట్రోల్‌ రూ. 84.20గా ఉండగా.. డీజీల్‌ విషయానికొస్తే.. లీటర్‌ ధర రూ. 74.38గా ఉంది. (గత మూడు రోజులుగా ఎలాంటి మార్పు లేదు). దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రల్‌ ధర రూ. 90.83 ఉండగా డీజీల్‌ రూ. 81.07గా ఉంది. చెన్నైలో మంగళవారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 87.03 ఉండగా డీజీల్‌ ధర రూ. 79.78గా ఉంది.

Also Read: SICMA : సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా సౌత్ ఇండియా.. ఒక్కటైన దక్షిణాది రాష్ట్రాల సిమెంట్ కంపెనీలు