నేడు తెలంగాణ విమోచన దినోత్సవం… నాడేం జరిగిందంటే?

నేడు తెలంగాణ విమోచన దినోత్సవం... నాడేం జరిగిందంటే?

1947 ఆగస్ట్ 15న మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కానీ… అప్పటి నిజాం సంస్థానంలోని తెలంగాణ ప్రజలకు మాత్రం స్వాతంత్య్రం లభించలేదు. అప్పట్లో నిజాం సంస్థానం చాలా పెద్దది. తెలంగాణతోపాటూ… మహారాష్ట్రలో 5 జిల్లాలు, కర్ణాటకలో 3 జిల్లాలు కూడా అందులో కలిసి ఉండేవి. నిజాం పాలకుల నిరంకుశ పాలనలో తెలంగాణ ప్రజలు నానా కష్టాలు పడ్డారు. అప్పట్లో దేశవ్యాప్తంగా 565 సంస్థానాలు ఉండేవి. బ్రిటీష్ పాలకులు స్వాతంత్య్రం ఇస్తూనే… సంస్థానాలు ఇండియాలో కలవాలో లేదో నిర్ణయించుకునే […]

TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Sep 17, 2019 | 4:32 PM

1947 ఆగస్ట్ 15న మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కానీ… అప్పటి నిజాం సంస్థానంలోని తెలంగాణ ప్రజలకు మాత్రం స్వాతంత్య్రం లభించలేదు. అప్పట్లో నిజాం సంస్థానం చాలా పెద్దది. తెలంగాణతోపాటూ… మహారాష్ట్రలో 5 జిల్లాలు, కర్ణాటకలో 3 జిల్లాలు కూడా అందులో కలిసి ఉండేవి. నిజాం పాలకుల నిరంకుశ పాలనలో తెలంగాణ ప్రజలు నానా కష్టాలు పడ్డారు. అప్పట్లో దేశవ్యాప్తంగా 565 సంస్థానాలు ఉండేవి. బ్రిటీష్ పాలకులు స్వాతంత్య్రం ఇస్తూనే… సంస్థానాలు ఇండియాలో కలవాలో లేదో నిర్ణయించుకునే ఛాన్స్ వాటికే ఇచ్చారు. ఫలితంగా… మూడు సంస్థానాలు ఇండియాలో కలవలేదు. అవి 1.కాశ్మీర్. 2.జునాఘడ్. 3.హైదరాబాద్ (నైజాం). ఆ పరిస్థితుల్లో… ఉక్కుమనిషి… సర్దార్ వల్లభాయ్ పటేల్… ప్రత్యేక శ్రద్ధ పెట్టి… జునాఘడ్ సంస్థానాన్ని భారత్‌లో కలిసేలా చేశారు.

నైజాం నవాబ్ మాత్రం విలీనానికి ఒప్పుకోలేదు. అప్పట్లో రజాకర్ల పేరుతో ప్రత్యేక సైన్యాన్ని తయారుచేసిన ఖాసిం రజ్వీ… మారణకాండకు తెగబడ్డాడు. స్వాతంత్య్రం వచ్చాక దాదాపు 13 నెలలపాటూ… తెలంగాణ ప్రజలు చూడని నరకం లేదు. కనీసం తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేశారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ఆదివాసీలు ఏకమై ఎదురుతిరిగారు. ఎంతో మంది ఉద్యమ నేతలు, కళాకారులు… అందరూ తమ ప్రాణాలు పణంగా పెట్టారు. ఉద్యమం అత్యంత తీవ్ర స్థితికి చేరిన తర్వాత… కేంద్ర ప్రభుత్వం ఆదేశంతో… ఏం చేసైనా సరే నిజాం సంస్థానాన్ని ఇండియాలో కలిపేయమని సర్ధార్ వల్లభాయ్ పటేల్‌కి సూచించింది.

నిజాం నవాబు పాకిస్థాన్ సాయం కోసం వర్తమానం పంపి, ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాడు. భారత సైన్యం 1948 సెప్టెంబర్ 13న ‘ఆపరేషన్ పోలో’ పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడిని ప్రారంభించింది. హైదరాబాద్ నలువైపుల నుంచి భారత సైన్యం ముట్టడిని ప్రారంభించింది. ముందుగా మహారాష్ట్ర వైపు నుంచి అన్ని గ్రామాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 14న ఔరంగాబాద్, జాల్నా, నిర్మల్, వరంగల్, సూర్యాపేటను ఆధీనంలోకి తీసుకోని హైదరాబాద్ వైపు వచ్చారు.

తుల్జాపూర్త నుంచి బయల్దేరిన సైన్యానికి జనరల్ డిఎస్ బ్రార్ నాయకత్వం వహించారు. మద్రాస్ వైపు నుంచి వచ్చిన సైన్యానికి ఎ.ఎ. రుద్ర, కర్ణాటక వైపు నుంచి వచ్చే సైన్యానికి బ్రిగేడియర్ శివదత్త నాయకత్వం వహించారు. హైదరాబాద్‌కు నలుదిశల నుంచి భారత సైన్యం ఒక్కో గ్రామాన్ని ఆధీనంలోకి తీసుకుంటుంటే.. ఆయా గ్రామాల్లోని ప్రజలు ఆర్మీకి స్వాగతాలు పలికారు. భారత సైన్యం ముందు రజాకార్లు, నిజాం సైన్యం ఎదురు నిలవలేకపోయింది. మూడు రోజుల్లోనే దక్కన్ భాగాన్ని పూర్తిగా భారత ఆర్మీ స్వాధీనం చేసుకుంది.

16 వ తేదీ మధ్యాహ్నం సమయానికి భారత సైన్యం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో మోహరించింది. భారత సైనిక సంపత్తికి భయపడి నిజాం సైన్యం ప్రధానాధికారి ఇద్రూస్ లొంగిపోయాడు. సెప్టెంబర్ 17న సాయంత్రం సుమారు 5 గంటల సమయానికల్లా భారత ఆర్మీ హైదరాబాద్‌ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. కాసేపాటలోనే  నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్టు రేడియో ద్వారా ప్రకటించాడు. అలా ఆపరేషన్ పోలో పూర్తయ్యింది. అప్పటి నుంచి సెప్టెంబరు 17ను ‘తెలంగాణ విమోచన దినోత్సవం’గా పాటిస్తున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu