Today Fuel Price: చమురు ధరలు రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. ఒకప్పుడు నెలకో, రెండు నెలకొకసారి ఇంధన ధరల్లో మార్పులు కనిపించేవి కానీ.. డీజీల్ ధరలను రోజువారీగా సవరిస్తోన్న నేపథ్యంలో.. ప్రస్తుతం ప్రతిరోజూ ఇంధన ధరల్లో మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రోజు రోజుకీ స్వల్ప మొత్తంలో పెట్రోల్, ధరలు తగ్గడమో, పెరగడమే జరుగుతోంది. ఇక తాజాగా శనివారం దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో పెరుగుదల కనిపించింది. ముంబైలో ఏకంగా లీటర్ పెట్రోల్ ఏకంగా రూ. 92కు చేరడం గమనార్హం. దేశ వ్యాప్తంగా శనివారం పెట్రోల్, డీజీల్ ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 88.89 ఉండగా, డీజీల్ ధర రూ. 82.53 గా పలికింది. ఇక కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.88.76 ఉండగా, డీజీల్ ధర రూ.82.40గా ఉంది.
ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర. 91.50గా ఉండగా, లీటర్ డీజీల్ రూ.84.67గా ఉంది. విశాఖపట్నంలో శనివారం లీటర్ పెట్రోల్ ధర. 90.60 పలకగా, డీజీల్ రూ.83.78 గా నమోదైంది. ఇక గుంటూరులో లీట్ పెట్రోల్ ధర రూ.91.50 ఉండగా, డీజీల్ విషయానికొస్తే రూ. 83.96గా పలికింది.
ఇక దేశరాజధాని ఢిల్లీ విషయానికొస్తే లీటర్ పెట్రోల్ ధర రూ. 85.45 కాగా డీజీల్ ధర రూ.75.63 గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.92.04 కాగా, లీటర్ డీజీల్ ధర రూ.82.40 గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.88.16 ఉండగా, డీజీల్ ధర రూ.84.67గా నమోదైంది.
Also Read: Gold Price: పసిడి ప్రియులకు శుభవార్త… కాస్త తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు తులం ధర ఎంతుందంటే..