నేడు ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జగ‌న్ ప‌ర్య‌ట‌న ఇలా.. న‌వ‌ర‌త్నాల్లో భాగంగా పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాల పంపిణీ

|

Dec 25, 2020 | 7:29 AM

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ, మ‌ర‌గిరిలో ప‌ర్య‌టించ‌నున్నారు. న‌వ‌ర‌త్నాలు-అంద‌రికీ ఇళ్లు పంపిణీలో భాగంగా ...

నేడు ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జగ‌న్ ప‌ర్య‌ట‌న ఇలా.. న‌వ‌ర‌త్నాల్లో భాగంగా పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాల పంపిణీ
Follow us on

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ, కొమ‌ర‌గిరిలో ప‌ర్య‌టించ‌నున్నారు. న‌వ‌ర‌త్నాలు-అంద‌రికీ ఇళ్లు పంపిణీలో భాగంగా మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు జ‌గ‌న్ క‌డ‌ప ఎయిర్ పోర్టు నుంచి ప్ర‌త్యేక విమానంలో రాజ‌మ‌హేంద్ర‌వ‌రం విమానాశ్ర‌యానికి చేరుకుంటారు. అక్క‌డి నుంచి వీఐపీ లాంచ్‌లో స్వ‌ల్ప విరామం త‌ర్వాత 1.10 గంట‌ల‌కు రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్ట‌ర్‌లో కొమ‌ర‌‌గిరి హెలిప్యాడ్ వ‌ద్ద‌కు చేరుకుంటారు. మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు పైలాన్‌ను ప్రారంభించి కొమరగిరిలో 1.30 నుంచి 3 గంట‌ల వ‌ర‌కు ఇళ్ల ప‌ట్టాల పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు.

3 గంట‌ల నుంచి 3.45 గంట‌ల వ‌ర‌కు సీఎం జ‌గ‌న్ ప్ర‌సంగం ఉంటుంది. 3.45 గంట‌ల నుంచి 3.55 గంట‌ల వ‌ర‌కు ల‌బ్దిదారుల‌కు సీఎం చేతుల మీదుగా ప‌ట్టాలు పంపిణీ చేస్తారు. అనంత‌రం 4.10 గంట‌ల‌కు కొమ‌ర‌గిరి దిగి అక్క‌డి నుంచి 4.40 గంట‌ల‌కు విమానంలో 5.20 గంట‌ల‌కు గ‌వ‌ర్న‌వ‌రం ఎయిర్ పోర్టుకు చేరుకుని, అక్క‌డి నుంచి రోడ్డు మార్గం గుండా సీఎం తాడేపల్లిలోని వాసానికి చేరుకుంటారు.