
తిరుమల శ్రీవారి ఆలయంలోని శ్రీ వరహా స్వామి ఆలయంలో ఇవాళ మహాసంప్రోక్షణ జరగనుంది. దీంతో శ్రీవారి దర్శనానికి కొన్ని గంటల పాటు బ్రేక్ ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. వరహాస్వామి ఆలయంలో ఉదయం 11.07గం.నుంచి మధ్యాహ్నం 1.16గంటల వరకు కర్కాటక లగ్నంలో ఈ క్రతవు జరగనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఘంటానాదం, నిత్యకట్ల కైంకర్యాల్లో భాగంగా తోమాల, అర్చన, నైవేద్యం, రెండో గంట తదితర పూజాదికాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3.30గంటల వరకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేయనున్నామని, భక్తులు గమనించాలని వారు కోరారు.