టిక్‌టాక్ స్టార్ కక్కర్ ఆత్మహత్య

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యను ఇంకా మర్చిపోకముందే తాజాగా మరో సెలెబ్రిటీ సూసైడ్ చేసుకుంది. టిక్‌టాక్ స్టార్‌గా తన టాలెంట్‌తో లక్షల మంది ఫాలోవర్లను...

టిక్‌టాక్ స్టార్ కక్కర్ ఆత్మహత్య

Updated on: Jun 26, 2020 | 9:17 AM

TikTok Star Siya Kakkar Died : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యను ఇంకా మర్చిపోకముందే తాజాగా మరో సెలెబ్రిటీ సూసైడ్ చేసుకుంది. టిక్‌టాక్ స్టార్‌గా తన టాలెంట్‌తో లక్షల మంది ఫాలోవర్లను సియా కక్కర్ సంపాదించుకున్నారు. 16 ఏళ్ల వయసులోనే సోషల్ మీడియాలో తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. డ్యాన్స్, నటనతో లక్షల మందిని ఆకట్టుకున్నారు. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రాం, స్నాప్‌చాట్, యూట్యూబ్‌ల్లో తన డ్యాన్సింగ్ వీడియోలతో కక్కర్ పాపులారిటీని దక్కించుకున్నారు.

ఢిల్లీలోని ప్రీతివిహార్‌లో ఆమె నివాసం ఉంటున్నారు. కక్కర్ తన ఇంట్లోనే విగత జీవిగా పడి ఉండటం చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు కక్కర్ మేనేజర్ అర్జున్. అంతకు ముందు రోజు రాత్రి కూడా బాగానే ఉందని తెలిపారు. కక్కర్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న కారణమేంటో అర్థం కాలేదని అన్నారు.

పదహారేళ్ల వయస్సులో ఉన్న సియా కక్కర్‌ ఆత్మహత్య… ఆమె అభిమానులను షాక్‌కి గురయ్యేలా చేసింది.  సోషల్ మీడియాలో ఆమెకు 11 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కక్కర్ చివరిసారిగా చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారుతోంది.