పశ్చిమగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అత్త, మరిది వేధింపులు భరించలేక బలవన్మరణానికి యత్నించింది ఓ కుటుంబం. కొవ్వూరులో ఇద్దరు కుమార్తెలతో పాటు గోదావరి నదిలో దూకింది తల్లి. భక్తాంజనేయ స్నానఘట్టం వద్ద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో చిన్న కుమార్తె గోదావరిలో గల్లంతైంది. కొవ్వూరు అచ్చమ్మ కాలనీకి చెందిన వరికూటి సాయి భర్త చనిపోవడంతో అత్తాగారింట్లోనే ఉంటుంది. దీంతో గతకొద్దిరోజులుగా కుటుంబసభ్యులు వేధింపులు భరించలేకపోయింది. దీంతో ఇద్దరు కుమార్తెలతో సహా బలవన్మరణానికి పాల్పడింది. తల్లి సాయితో పాటు పెద్ద కుమార్తెను స్థానికులు రక్షించారు. చిన్న కుమార్తె దర్శిని గోదావరిలో గల్లంతైంది. అచ్చమ్మ కాలనీకి చెందిన వరికూటి సాయి భర్త ప్రసాద్ 5 నెలల క్రితం అకాలమరణం చెందాడు. అయితే, అత్త, మరిది వేధింపులు కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గల్లంతైన దర్శిని కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపుచర్యలు చేపట్టారు.