9 అడుగులకే ఖైరతాబాద్ మహా గణపతి.. ఈసారి మట్టితో..

ఖైరతాబాద్ లో గణనాధుడి విగ్రహం తయారీ ప్రారంభమైంది. కరోన నిబంధనల నేపథ్యంలో ఈసారి 9 అడుగులకే గణపతి విగ్రహాన్ని పరిమితం చేశారు. ఉత్సవకమిటి పూర్తిగా మట్టితోనే గణపతి నిలపాలని నిర్ణయించింది.

9 అడుగులకే ఖైరతాబాద్ మహా గణపతి.. ఈసారి మట్టితో..

Edited By:

Updated on: Aug 05, 2020 | 12:19 PM

Khairatabad Ganesh is only 9 feet: దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఈ క్రమంలో ఖైరతాబాద్ మహా గణపతి తన రూపాన్ని తగ్గించుకున్నాడు. ఖైరతాబాద్ లో గణనాధుడి విగ్రహం తయారీ ప్రారంభమైంది. కరోన నిబంధనల నేపథ్యంలో ఈసారి 9 అడుగులకే గణపతి విగ్రహాన్ని పరిమితం చేశారు. ఉత్సవకమిటి పూర్తిగా మట్టితోనే గణపతి నిలపాలని నిర్ణయించింది. ఈసారి ధన్వంతరి నారాయణ మహా గణపతి రూపంలో ఖైరతాబాద్ మహా గణపతి దర్శనమివ్వనున్నారు. కరోనా ఆంక్షల క్రమంలో ఆన్‌లైన్‌లో దర్శనం అవకాశం కల్పిస్తామని ఉత్సవ కమిటీ పేర్కొంది. కాగా.. గత ఏడాది 65 అడుగులతో ద్వాదశాదిత్య మహా గణపతిగా పూజలు అందుకున్నాడు ఖైరతాబాద్ గణేషుడు. కరోనా కట్టడికోసం భౌతిక దూరం పాటిస్తూ దర్శనాలు ఏర్పాటు చేస్తామంటున్నారు నిర్వాహకులు.

Read More:

మూడవ అతిపెద్ద హిందూ ఆలయంగా.. అయోధ్య..!

గుడ్ న్యూస్: 1167 బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్