సూప‌ర్బ్ జాబ్ ఆఫ‌ర్..టీవీ చూస్తే గంటకు రూ.3,281 జీతం..!

కరోనావైర‌స్ యావ‌త్ ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేసింది. దీని దెబ్బ‌కు అన్ని రంగాలు కుదేల‌య్యాయి. చాలామంది ఉద్యోగాలు కొల్పోతున్నారు. ఇలాంటి కరువు కాలంలో ఓ కంపెనీ అదిరిపోయే ఉద్యోగ అవకాశాన్ని అనౌన్స్ చేసింది.

  • Ram Naramaneni
  • Publish Date - 3:34 pm, Fri, 26 June 20
సూప‌ర్బ్ జాబ్ ఆఫ‌ర్..టీవీ చూస్తే గంటకు రూ.3,281 జీతం..!

కరోనావైర‌స్ యావ‌త్ ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేసింది. దీని దెబ్బ‌కు అన్ని రంగాలు కుదేల‌య్యాయి. చాలామంది ఉద్యోగాలు కొల్పోతున్నారు. ఇలాంటి కరువు కాలంలో ఓ కంపెనీ అదిరిపోయే ఉద్యోగ అవకాశాన్ని అనౌన్స్ చేసింది. పైగా ఈ ఉద్యోగం కోసం చెమ‌ట చిందిస్తూ పెద్ద‌గా క‌ష్ట‌పడాల్సిన అవ‌స‌రం కూడా లేదు. జస్ట్ టీవీ చూడ‌ట‌మే మీ జాబ్. ఇలా చేస్తే గంటకు 35 పౌండ్లు (రూ.3,281) చొప్పున స‌ద‌రు సంస్థ పే చేస్తోంది. యూకేకు చెందిన ‘ఆన్ బయ్’(OnBuy) అనే కంపెనీ ఈ క్రేజీ ఆఫ‌ర్ తో ముందుకు వచ్చింది. 18 ఏళ్ల వయస్సు దాటినవారు ఎవ‌రైనా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవ‌చ్చు. అయితే వీరికి మంచి స్పోకెన్ ఇంగ్లీష్, కంటెంట్ రాయగలిగే తెలివితేట‌లు ఉండాలి. ఈ అర్హతలు ఉంటేనే కంపెనీ గంటకు 35 పౌండ్లు చొప్పున పే చేస్తోంది. ఒక వారంలో కేవలం 20 గంటలు మాత్ర‌మే టీవీ చూడాల్సి ఉంటుంది. వారానికి 700 పౌండ్లు (రూ.65,000 వేలు) చెల్లిస్తుంది. ఉద్యోగి ‘టెక్ టెస్టర్’గా డ్యూటీ చేయాలి.

‘ఆన్‌బాయ్’ సంస్థ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులైన టీవీలు, సినిమా సిస్టమ్స్, కెమేరాలు, హెడ్‌ఫోన్లు, స్మార్ట్ టెక్నాలజీ తదితర వస్తువులను ఉత్ప‌త్తి చేస్తోంది. ఈ జాబుకు అర్హ‌త సాధించిన‌వారికి ఆ సంస్థ ప్రతి నెల ఒక ప్రొడక్టును అందిస్తుంది. ఉద్యోగి దాన్ని టెస్ట్ చేసి.. రివ్యూ రాసి ఆ కంపెనీ సైటులో పోస్టు చేయాలి. పెట్టిన రేటుకు తగినట్లుగా ఆ వస్తువు వ‌ర్క్ చేస్తుందా..లేదా.. చెప్పాలి. ఆ ప్రొడక్టు గురించి 200 పదాలతో స‌మీక్ష ఇస్తే స‌రిపోతుంది. ఈ సంస్థ ఎక్కువ‌గా టీవీలు త‌యారు చేస్తుంది కాబట్టి.. వాటిని వారంలో 20 గంటలు వీక్షించి పరీక్షించి.. సమీక్ష ఇస్తే ఒక‌వైపు టైమ్ పాస్ అవుతుంది..మ‌రోవైపు జీతం కూడా వస్తుంది.