ఆ జైలులో 114 మందికి కరోనా పాజిటివ్‌..!

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కేరళ రాజధాని తిరువనంతపురం సెంట్రల్‌ జైలులో కొత్తగా 114 మందికి కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. ఇప్పటి వరకు

ఆ జైలులో 114 మందికి కరోనా పాజిటివ్‌..!

Edited By:

Updated on: Aug 17, 2020 | 8:51 PM

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కేరళ రాజధాని తిరువనంతపురం సెంట్రల్‌ జైలులో కొత్తగా 114 మందికి కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. ఇప్పటి వరకు సెంట్రల్‌జైలులో 476 మంది మహమ్మారి బారినపడ్డారు. ఆదివారం 145 మందిని వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించగా, తాజాగా సోమవారం 114 కేసుల్లో నలుగురు సిబ్బంది కాగా మిగిలిన వారంతా ఖైదీలే. ఇప్పటి వరకు 8 మంది సిబ్బంది వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించగా, అధికారులు ఆందోళనకు గురవుతున్నారు.

మహమ్మ్మరి వ్యాప్తి క్రమంలో.. జైల్లోనే ప్రత్యేక ఏర్పాట్లు చేసి చికిత్సలు అందించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. 72 ఏళ్ల ఖైదీ వైరస్‌ బారినపడగా మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌లో ఆదివారం మరణించాడు. రానున్న రోజుల్లో మరిన్ని యాంటీజెన్ పరీక్షలు నిర్వహిస్తామని జైలు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జైలులో మొత్తం 975 మంది ఖైదీలు ఉన్నారు. గత మంగళవారం మాణిక్‌కందన్‌కు వైరస్‌ సోకినట్లు ధ్రువీకరించడంతో పూజాపురా జైలులో ఖైదీలకు పరీక్షలు చేస్తున్నారు. కాగా, వైరస్‌ ఎలా సోకిందనే విషయం మిస్టరీగా మారింది.