జోమాటో డెలివరీ బాయ్‌కు కరోనా.. తిరువనంతపురంలో హై అలర్ట్..!

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో జోమాటో డెలివరీ బాయ్‌కు

జోమాటో డెలివరీ బాయ్‌కు కరోనా.. తిరువనంతపురంలో హై అలర్ట్..!

Updated on: Jul 05, 2020 | 5:58 AM

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో జోమాటో డెలివరీ బాయ్‌కు కరోనా సోకడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కేరళ రాజధాని నగరమైన తిరువనంతపురంలో ఒక్కరోజే ఓ మెడికల్ రిప్రజెంటేటివ్, ఓ పోలీసు అధికారికి కరోనా సోకింది. 24 గంటల్లో 240 కరోనా కేసులు వెలుగుచూడటంతో తిరువనంతపురంలో హైఅలర్ట్ ప్రకటించారు.

వివరాల్లోకెళితే.. తిరువనంతపురం నగర శివార్లలోని పలయం మార్కెట్ సమీపంలోని లాడ్జీలో నివాసముంటున్న జోమాటో డెలివరీ బాయ్ (37)కు కొవిడ్ లక్షణాలు కనిపించడంతో అతన్ని పరీక్షించారు. డెలివరీ బాయ్ కు కరోనా పాజిటివ్ అని రావడంతో అతన్ని ఐసోలేషన్ చేశారు. కజాకొట్టాం ప్రాంతంలోని పలు ఆసుపత్రులను సందర్శించిన 27 ఏళ్ల మెడికల్ రిప్రజెంటేటివ్ కు కరోనా సోకిందని తేలడంతో ఆయా ఆసుపత్రుల్లో వారు కలవరపడ్డారు. తిరువనంతపురం సచివాలయంలో విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీసు అధికారికి కూడా కరోనా సోకింది.

Loading...
Unable to load recommendations.
Follow Us