పవన్ పర్యటనలో జేబు దొంగలు హల్‌చల్!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటనలో జేబు దొంగలు హల్‌చల్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోగా.. అక్కడ అభిమానులు ఎక్కువ మంది గుమ్ముగూడటంతో తోపులాట జరిగింది. ఇదే అదనుగా జేబు దొంగలు.. సుమారు 40 మంది పర్సులు, ఫోన్లు కొట్టేశారు. అంతేకాక జనసేన ముఖ్యనేతల ఫోన్లు కూడా మాయమైనట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కార్యకర్తలు.. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. కాగా, పోలీసులు కేసు నమోదు చేసి […]

పవన్ పర్యటనలో జేబు దొంగలు హల్‌చల్!

Updated on: Dec 01, 2019 | 9:45 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటనలో జేబు దొంగలు హల్‌చల్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోగా.. అక్కడ అభిమానులు ఎక్కువ మంది గుమ్ముగూడటంతో తోపులాట జరిగింది. ఇదే అదనుగా జేబు దొంగలు.. సుమారు 40 మంది పర్సులు, ఫోన్లు కొట్టేశారు. అంతేకాక జనసేన ముఖ్యనేతల ఫోన్లు కూడా మాయమైనట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కార్యకర్తలు.. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. కాగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరోవైపు జనసేన పార్టీని సీమలో బలోపేతం చేయడానికి పవన్ ఇవాళ్టి నుంచి ఆరు రోజుల పాటు రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై ప్రజలతో పవన్ ముఖాముఖిగా మాట్లాడనున్నారు. సంక్షేమ పథకాల లబ్ది అర్హులకు అందించడంలో పాలక పక్షం చూపిస్తున్న నిర్లక్ష్యం మూలంగా ఇబ్బందులు పడుతున్న వారిని జనసేన చీఫ్ కలవనున్నారు.