చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులు విసిరింది వీరే..!

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం తీవ్ర రసాభాసగా మారింది. ఇందులో భాగంగా.. చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లు విసిరారు కొందరు. ఈ ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ విచారించారు. అసలు చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పులు విసిరింది ఎవరో ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులతో, రాళ్లతో దాడి చేసిన ఘటనలో ఇద్దరిని అదుపులోకి […]

చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులు విసిరింది వీరే..!

Edited By:

Updated on: Nov 28, 2019 | 6:09 PM

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం తీవ్ర రసాభాసగా మారింది. ఇందులో భాగంగా.. చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లు విసిరారు కొందరు. ఈ ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ విచారించారు. అసలు చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పులు విసిరింది ఎవరో ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులతో, రాళ్లతో దాడి చేసిన ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. చెప్పులు విసిరిన వ్యక్తి.. రైతు అని.. రాళ్లు విసిరిన వ్యక్తి రియల్ ఎస్టేట్ వెంచర్‌ వ్యాపారానికి సంబంధించిన వ్యక్తి అని డీజీపీ తెలిపారు. వారిద్దరినీ విచారించగా.. చంద్రబాబు వల్ల వారికి అన్యాయం జరిగిందని.. వారు అన్నట్లు తెలిపారు డీజీపీ.

అలాగే.. రాజకీయ కామెంట్స్‌పై మేము మాట్లాడమని.. మా విచారణలో.. పెద్దగా వివాదాలు జరగవని తేలినందువల్లే.. చంద్రబాబు పర్యటనకు అనుమతిచ్చినట్లు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.