Zodiac Signs: సెప్టెంబర్ 17 నుంచి ఈ రాశులవారి పంట పండినట్లే.. సూర్యుడిలా వీరి జీవితాలు ప్రకాశించడం ఖాయం..!

|

Sep 04, 2023 | 10:31 AM

Sun Transit 2023: సూర్యుడు సెప్టెంబర్ 17న ఉదయం 7:11 గంటలకు కన్యారాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఫలితంగా రాశి చక్రంలోని కొన్ని రాశుల వారు మెరుగైన ఫలితాలను పొందబోతున్నారు. ఈ క్రమంలో ఆయా రాశుల్లో జన్మించిన వారు అనూహ్య ధనప్రాప్తి పొందడంతో పాటు అన్ని రకాల వివాదాల నుంచి బయట పడతారు. ఇంతకీ ఆ రాశులేమిటి, వారికి కలిగే ఫలితాలు ఎలా ఉంటాయో..

Zodiac Signs: సెప్టెంబర్ 17 నుంచి ఈ రాశులవారి పంట పండినట్లే.. సూర్యుడిలా వీరి జీవితాలు ప్రకాశించడం ఖాయం..!
Sun Transit In Virgo
Follow us on

Sun transit 2023: సనాతన హిందూ ధర్మం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవ గ్రహాలకు సూర్యుడు రాజు. అలాగే సూర్యుడి అనుగ్రహం ఫలితంగా ఎలాంటి వారి జీవితంలో అయినా అదృష్టం ఉదయిస్తుంది. అలాంటి సూర్యుడు సెప్టెంబర్ 17న ఉదయం 7:11 గంటలకు కన్యారాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఫలితంగా రాశి చక్రంలోని కొన్ని రాశుల వారు మెరుగైన ఫలితాలను పొందబోతున్నారు. ఈ క్రమంలో ఆయా రాశుల్లో జన్మించిన వారు అనూహ్య ధనప్రాప్తి పొందడంతో పాటు అన్ని రకాల వివాదాల నుంచి బయట పడతారు. ఇంతకీ ఆ రాశులేమిటి, వారికి కలిగే ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

వృషభ రాశి: కన్యా రాశిలో సూర్య సంచారం వృషభ రాశివారికి మెరుగైన ఫలితాలను తీసుకొస్తుంది. ఈ అద్భుతమైన సమయం మీకు పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో అనుకూలమైన సమయం. ఇంకా మీరు కొత్త అదాయ మార్గాలను, ఉద్యోగ అవకాశాలను పొందుతారు.

కర్కాటక రాశి: కన్యా రాశిలో సూర్యుడి ప్రవేశం కర్కాటక రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉండనుంది. ఫలితంగా ఈ సమయంలో మీరు ఉద్యోగంలో పురోగతి పొందుతారు. యువ ఉద్యోగులు ఇంక్రిమెంట్‌తో పాటు, ట్రాన్ఫర్ అయ్య అవకాశం ఉంది. అప్పుల బాధలు తొలగిపోయి, ఆర్థికంగా స్థిరపడతారు.

ఇవి కూడా చదవండి

వృశ్చిక రాశి: సూర్యుడి కన్యా రాశి సంచారం వృశ్చిక రాశి వారు ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు ఉపకరిస్తుంది. ఈ సమయంలో మీ శ్రమకు తగిన గుర్తింపు, ఫలితం లభిస్తాయి. అలాగే నలుగురు మీకు అనుకూలంగా, అండగా నిలుస్తారు. కుటుంబ సభ్యుల నుంచి మద్ధతు లభిస్తుంది. ఆర్థిక లాభాలను పొందుతారు.

మకర రాశి: సూర్యుడు కన్యా రాశిలో సంచరించడం వల్ల మకర రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాల్లో లాభాలు, నలుగురిలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. యువకులకు పెళ్లి కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.