ఒంగోలులో రెచ్చిపోయిన దొంగలు

|

Sep 14, 2020 | 2:03 PM

ప్రకాశం జిల్లా ఒంగోలులో దొంగలు రెచ్చిపోయారు. ఎల్‌వి సుబ్బయ్య కాలనీలోని జియస్‌ఆర్‌ ఆపార్ట్‌మెంట్స్‌లోని రెండు ఫ్లాట్లలో చోరీకి పాల్పడ్డారు. ఉదయం ఆపార్ట్‌మెంట్‌లోని రెండు ఫ్లాట్ల తాళాలు..

ఒంగోలులో రెచ్చిపోయిన దొంగలు
Follow us on

ప్రకాశం జిల్లా ఒంగోలులో దొంగలు రెచ్చిపోయారు. ఎల్‌వి సుబ్బయ్య కాలనీలోని జియస్‌ఆర్‌ ఆపార్ట్‌మెంట్స్‌లోని రెండు ఫ్లాట్లలో చోరీకి పాల్పడ్డారు. ఉదయం ఆపార్ట్‌మెంట్‌లోని రెండు ఫ్లాట్ల తాళాలు పగులగొట్టి ఉన్న విషయాన్ని గమనించిన పక్క ఫ్లాట్‌ యజమానులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో చోరీ జరిగిన అపార్ట్‌మెంట్‌కు చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్‌ టీంను రంగంలోకి దించి ఆధారాలు సేకరిస్తున్నారు. చోరీ జరిగిన రెండు ఫ్లాట్ల యజమానుల్లో ఒకరైన మురళీకృష్ణ కరోనా నేపధ్యంలో తన ఫ్లాట్‌కు తాళం వేసి పక్కనే ఉన్న గ్రామంలో తన ఫామ్‌ హౌస్‌లో ఉంటున్నారు. వారానికి ఒకసారి తన ఫ్లాట్‌కు వచ్చి వెళుతున్నారు. మురళీకృష్ణ ఇంట్లో 70 సవర్ల బంగారం అపహరణకు గురైందని గుర్తించారు. అలాగే చోరీ జరిగిన మరో ఫ్లాట్‌ యజమాని యానాదిరావు అమెరికాలో ఉన్నారు. ఆయన కరోనా కారణంగా అక్కడే చిక్కుకున్నారు. యానాదిరావుకు చెందిన ఫ్లాట్‌లో 60 సవర్లు బంగారు నగలు, 5 కిలోల వెండి అపహరణకు గురైందని గుర్తించారు. చోరీ జరిగిన రెండు ఇళ్లను ఒంగోలు డిఎస్‌పి ప్రసాద్ పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.