డిసెంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు.. ఆ రాష్ట్రంలోనైతే మరీను… ఖాతాదారులకు కష్టాలే!
మీరు బ్యాంకు లావాదేవీలను నిత్యం చేస్తూ ఉంటారా..? అయితే డిసెంబర్ నెలలో బ్యాంకులకు ఏఏ రోజు సెలువులొస్తున్నాయో తెలుసా... సాధారణ సెలవు రోజుల కంటే డిసెంబర్ నెలలో ఆరు రోజులతో పాటు మరో రోజు..
మీరు బ్యాంకు లావాదేవీలను నిత్యం చేస్తూ ఉంటారా..? అయితే డిసెంబర్ నెలలో బ్యాంకులకు ఏఏ రోజు సెలువులొస్తున్నాయో తెలుసా… సాధారణ సెలవు రోజుల కంటే డిసెంబర్ నెలలో ఆరు రోజులతో పాటు మరో రోజు హాలిడే వచ్చింది. అయితే తెలంగాణలోని హైదరాబాద్ పరిధిలోని బ్యాంకులకు మాత్రం మరో రోజు అధికంగా హాలిడే వచ్చింది. అది ఎందుకంటే… జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం డిసెంబర్ 1న సెలవు దినంగా ప్రకటించింది.
మొత్తంగా తెలంగాణలో బ్యాంకుల సేవలు డిసెంబర్ నెలలో 8 రోజుల పాటు దూరమవనున్నాయి. మరో విషయం ఎంటంటే… డిసెంబర్ 25న క్రిస్మస్ కావడంతో ఆరోజు బ్యాంకులకు సెలవే. డిసెంబర్ 26 నాలుగో శనివారం, 27 ఆదివారం ఉంది కాబట్టి…. డిసెంబర్ 25 నుంచి 27 వరకు బ్యాంకులు తెరుచుకోవు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే సెలవులు ప్రభుత్వ బ్యాంకులతో ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులకు వర్తిస్తాయన్న సంగతి కస్టమర్లు గుర్తుంచుకోవాలి.
ఏఏ రోజులు సెలవంటే.. డిసెంబర్ 1న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు డిసెంబర్ 6న ఆదివారం డిసెంబర్ 12న రెండో శనివారం డిసెంబర్ 13న ఆదివారం డిసెంబర్ 20న ఆదివారం డిసెంబర్ 25న క్రిస్మస్ డిసెంబర్ 26 నాలుగో శనివారం డిసెంబర్ 27న ఆదివారం