ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మితమౌతోన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇవాళ కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కాసేపట్లో పోలవరం స్పిల్ ఛానెల్ కు కాంక్రీట్ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఇరిగేషన్, మేఘా ఇంజనీరింగ్ నిపుణలు పర్యవేక్షణలో క్రతువుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. గోదావరికి వరద తర్వాత ఇవాళ మొదటిసారిగా కాంక్రీట్ పని ఆరంభం కాబోతోండటం విశేషం. మరోవైపు, వివిధ సిగ్మెంట్ లకు సంబంధించి ప్రాజెక్టు నిర్మాణ పనులు గతంతో పోల్చితే వేగం పెంచుకున్నాయి. ప్రభుత్వం పెట్టిన లక్ష్యాన్ని చేరుకునే దిశగా శరవేగంగా పనులు సాగుతున్నాయి.