
అమెరికాలోని టెక్సాస్ లో 17 ఏళ్ళ టీనేజర్ వరల్డ్ రికార్డులకెక్కింది. తన పొడవైన కాళ్లతో ఆమె గిన్నెస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. పేరు..మెసీ కరిన్.. 6 అడుగుల 10 అంగుళాల పొడవున్న ఈ అమ్మాయి కాళ్లే 4 అడుగుల పొడవున్నాయట ! ఈమె లెగ్స్ ఈమె మొత్తం పొడవులో 60 శాతం ఉన్నట్టు గిన్నెస్ వాళ్ళు లెక్క కట్టారు. తన కుటుంబ సభ్యుల్లో అందరికన్నా తానే పొడవని, ఇలా ఉండడంవల్ల కొన్ని ప్రయోజనాలు, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని కరిన్ అంటోంది; లెగ్గింగ్స్, షూస్, డ్రెస్ ఇలా ఒకటేమిటి చాలావాటిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అందరూ తనను స్పెషల్ గా చూడడం గర్వంగా అనిపిస్తోందని చెబుతోంది. ఇప్పటికే టిక్ టాక్ లో పాపులర్ ఆయిన ఈ టీనేజర్.. మోడలింగ్ ని తన కెరీర్ గా మలచుకోవాలని, వరల్డ్ లోనే టాలెస్ట్ మోడల్ గా రికార్డు బద్దలు కొట్టాలని అనుకుంటోంది.