VS/WS Examinations 2020: కరోనా వైరస్ తీవ్రత కారణంగా వాయిదా పడిన గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. ఈ క్రమంలోనే ఎగ్జామ్స్ నిర్వహించే తేదీలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఎగ్జామ్స్ కు సంబంధించిన షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది. సెప్టెంబర్ 20 నుంచి సెప్టెంబర్ 26 వరకు పరీక్షలు నిర్వహించనుండగా.. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో పరీక్షలు జరగనున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో మూడు నుంచి ఐదు వేల పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
కాగా, 19 రకాల పోస్టులకు సంబంధించి గ్రామ సచివాలయాల్లో 14,062, వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టుల భర్తీకి ఈ ఏడాది జనవరిలో పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. వీటికి సంబంధించి మొత్తం 11.06 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. ఆయా పోస్టుల భర్తీకి 14 రకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.
Tentative Schedule for VS/WS Examinations 2020 is as given below. All concerned are requested to take a note of this. pic.twitter.com/XjTRFXhhpe
— Gopal Krishna Dwivedi (@gkd600) August 14, 2020
Also Read:
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’..