తమిళనాడులో ఆలయాలకు పోటెత్తిన భక్తులు

తమిళనాడులో ఆలయాలు భక్తుల కోసం తెరచుకున్నాయి.. లాక్‌డౌన్‌ నిబంధనల నుంచి ఆలయాలకు మినహాయింపు రావడంతో ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు భక్తుల కోసం తెరచుకున్నాయి.. దాదాపు అయిదు నెలల తర్వాత దేవదేవుళ్ల దర్శనభాగ్యం లభిస్తుండటంతో ప్రతీ ఆలయానికి భక్తులు విపరీతంగా వచ్చారు.

తమిళనాడులో ఆలయాలకు పోటెత్తిన భక్తులు

Updated on: Sep 01, 2020 | 1:44 PM

తమిళనాడులో ఆలయాలు భక్తుల కోసం తెరచుకున్నాయి.. లాక్‌డౌన్‌ నిబంధనల నుంచి ఆలయాలకు మినహాయింపు రావడంతో ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు భక్తుల కోసం తెరచుకున్నాయి.. దాదాపు అయిదు నెలల తర్వాత దేవదేవుళ్ల దర్శనభాగ్యం లభిస్తుండటంతో ప్రతీ ఆలయానికి భక్తులు విపరీతంగా వచ్చారు.. ఇప్పటికే కరోనా నిబంధనలలో భాగంగా అన్ని ప్రధాన ఆలయాలను పూర్తిగా అధికారులు శానిటైజ్‌ చేశారు.. ఇక మదురై ఆలయంలో మీనాక్షి అమ్మవారి దర్శనం కోసం కిలోమీటర్ల మేర భక్తులు పడిగాపులు కాస్తున్నారు. పలు ముఖ్య ఆలయాలకు భక్తులు ఒక్కసారిగా పోటెత్తడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆలయాలకు వచ్చే భక్తులకు మాస్క్‌లు, శానిటైజర్లు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. భక్తులు గుంపులు గుంపులుగా దర్శనాలకు రావద్దని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు.. భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అయితే అధికారుల హెచ్చరికలను, సూచనలను భక్తులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.. మాస్కులు లేకుండానే గుడిలోకి వస్తున్నారు.. దర్శనాలకు ఎగబడుతున్నారు.. వారిని అదుపు చేయడం పోలీసు సిబ్బందికి కష్టమవుతోంది.. మాస్కులు పెట్టుకోకుండా, భౌతికదూరాన్ని పాటించకుండా నిబంధనలను ఉల్లంఘిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us