తెలంగాణలో 5 వేలు దాటిన కరోనా కేసులు

రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 219 కరోనా కేసులు. మొత్తం 5,193 కేసులు నమోదుకాగా.. 187 మంది మృతిచెందారు.

తెలంగాణలో 5 వేలు దాటిన కరోనా కేసులు

Updated on: Jun 15, 2020 | 10:34 PM

రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 219 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి ఇద్దరు మృతిచెందారు. నేటితో రాష్ట్రంలో మొత్తం 5,193 కేసులు నమోదుకాగా.. 187 మంది మృతిచెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఈ ఒక్కరోజే 189 కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి లో 2, మేడ్చల్ లో 2, రంగారెడ్డిలో 13, వరంగల్ అర్బన్ 4, వరంగల్ రూరల్ 3, మహబూబ్ నగర్, మెదక్ , అదిలాబాద్ , యాదాద్రి, వనపర్తి, పెద్దపల్లి జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదైనట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు రాష్ట్రం 2,766 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం వివిధ అస్పత్రుల్లో చికిత్స పొందున్న యాక్టివ్ కేసుల సంఖ్య 2, 240 ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

Loading...
Unable to load recommendations.
Follow Us