భారీ వర్షాలతో విద్యుత్ శాఖ అలర్ట్.. కంట్రోల్ రూం ఏర్పాటు..

| Edited By: Pardhasaradhi Peri

Oct 13, 2020 | 6:56 PM

రాష్ట్రంలో కురుస్తున్న కుండపోత వర్షాల నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ శాఖ అప్రమత్తమైంది.

భారీ వర్షాలతో విద్యుత్ శాఖ అలర్ట్.. కంట్రోల్ రూం ఏర్పాటు..
Follow us on

రాష్ట్రంలో కురుస్తున్న కుండపోత వర్షాల నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. సూపరింటెండింగ్ ఇంజనీర్, చీఫ్ జనరల్ మేనేజర్‌లతో విద్యుత్ సరఫరా పరిస్థితిని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ సీఎండీ రఘుమా రెడ్డి సమీక్షించారు. టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలోని చీఫ్ జనరల్ మేనేజర్, సూపెరింటెండింగ్ ఇంజినీర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎండీ రఘుమా రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

వర్షం నీరు నిల్వ వున్న చోట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు, తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా రోడ్లపై, భవనాలపై తీగలు తెగిపడి ఉంటే వెంటనే సంస్థకు తెలియజేయాలని రఘుమా రెడ్డి కోరారు. విద్యుత్ వోల్టేజీలో హెచ్చు తగ్గులు ఉన్నా, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినా 1912/100/ స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106, 7382071574 లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని రఘుమా రెడ్డి సూచించారు.

ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో 189 సెక్షన్ స్థాయి డిసాస్టర్ మేనేజ్మెంట్ వింగ్ ల ఏర్పాటు చేశామని సీఎండీ రఘుమా రెడ్డి తెలిపారు. ప్రతి వింగ్ లో ఏఈ ఆధ్వర్యంలో 25 మంది సుశిక్షిత సిబ్బంది అందుబాటు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అటు జిల్లాల అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలన్న ఆయన జిల్లా సూపెరింటెండింగ్ ఇంజినీర్లు, డివిషనల్ ఇంజినీర్లు క్షేత్ర సిబ్బందితో ఎప్పటికపుడు సంప్రదిస్తూ విద్యుత్ సరఫరా పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు.