నగరవాసులకు పోలీస్ శాఖ హెచ్చరిక…

|

May 31, 2020 | 3:49 PM

హైదరాబాదీలకు పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నగరంలో మొబైల్ ఫోన్ స్నాచర్లు తిరుగుతున్నారని.. ప్రజలు రోడ్లపైకి వచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలని సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. ఇటీవల అబిడ్స్ పరిసరాల పరిధిలో ఓ అమ్మాయి చేతిలో నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు మొబైల్ ఫోన్ లాక్కుని పారిపోయారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా..  బైక్‌పై వచ్చిన ఇద్దరు నిందితులు ముఖానికి మాస్కులు ధరించడం.. అంతేకాక చోరీలో […]

నగరవాసులకు పోలీస్ శాఖ హెచ్చరిక...
Follow us on

హైదరాబాదీలకు పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నగరంలో మొబైల్ ఫోన్ స్నాచర్లు తిరుగుతున్నారని.. ప్రజలు రోడ్లపైకి వచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలని సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. ఇటీవల అబిడ్స్ పరిసరాల పరిధిలో ఓ అమ్మాయి చేతిలో నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు మొబైల్ ఫోన్ లాక్కుని పారిపోయారు.

పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా..  బైక్‌పై వచ్చిన ఇద్దరు నిందితులు ముఖానికి మాస్కులు ధరించడం.. అంతేకాక చోరీలో వాడిన బైక్‌కు నెంబర్ ప్లేట్ లేకపోవడంతో.. పోలీసులకు స్నాచర్లను పట్టుకోవడం కష్టతరంగా మారింది. దీనితో సిటీలో ఉన్న అన్ని వాహనాల నెంబర్ ప్లేట్లనూ వారు తనిఖీ చేస్తున్నారు. నెంబర్ ప్లేట్ లేకున్నా, ఇంగ్లీష్ లెటర్స్, నెంబర్స్ సరిగ్గా లేకపోయినా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి నగరవాసులు బయటికి వచ్చినప్పుడు మొబైల్స్ జాగ్రత్తగా చూసుకోండి.

[svt-event date=”31/05/2020,2:43PM” class=”svt-cd-green” ]