దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం.. 13వ స్థానంలో ఏపీ..

|

Aug 20, 2020 | 11:46 AM

దేశంలోనే అత్యధిక మంచి నీటి నల్లా కనెక్షన్‌లు ద్వారా ఇంటింటికి మంచి నీరు సరఫరా చేయడంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర జలవనరుల శాఖ రిపోర్టు ఇచ్చింది.

దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం.. 13వ స్థానంలో ఏపీ..
Follow us on

Telangana Tap Connections: దేశంలోనే అత్యధిక మంచి నీటి నల్లా కనెక్షన్‌లు ద్వారా ఇంటింటికి మంచి నీరు సరఫరా చేయడంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర జలవనరుల శాఖ రిపోర్టు ఇచ్చింది. ఇప్పటివరకు తెలంగాణ 98.29 శాతం నల్లా కనెక్షన్స్ ఇవ్వగా.. గోవాలో 89.05 శాతం ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఉన్నాయి.

ఈ రెండు రాష్ట్రాల తర్వాత ఎక్కువ నల్లా కనెక్షన్లు ఇచ్చిన రాష్ట్రాల్లో పుదుచ్చేరి, హర్యానా, గుజరాత్ టాప్ 5 లిస్టులో ఉన్నాయి. ఇక 34.62 శాతం నల్లా కనెక్షన్లతో ఆంధ్రప్రదేశ్‌ 13వ స్థానంలో ఉండగా.. మేఘాలయ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో చివరి స్థానాల్లో నిలిచాయి. కాగా, ఈ విషయంపై స్పందించిన మంత్రి కేటీఆర్.. ”ఇదంతా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముందుచూపుతోనే మిషన్ భగీరధతోనే సాధ్యమైందని” ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Also Read:

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ‘వైఎస్సార్ ఆసరా’కు కేబినెట్ ఆమోదం..

మురుగునీటిలో కరోనా వైరస్.. తేల్చేసిన పరిశోధకులు..

డిలేట్ చేసిన వాట్సాప్ వీడియోలు, ఇమేజ్స్‌ను రికవర్ చేయండిలా..