పోలీస్ ఉన్నతాధికారులతో హోంమంత్రి సమావేశం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా పోలీస్ ఉన్నతాధికారులతో హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చర్చించిన విషయాలను...

పోలీస్ ఉన్నతాధికారులతో హోంమంత్రి సమావేశం
Sanjay Kasula

|

Sep 07, 2020 | 9:00 PM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా పోలీస్ ఉన్నతాధికారులతో హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చర్చించిన విషయాలను పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి సమీక్షించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాంతి భద్రతలను కాపాడడంతో పోలీసులు చేసిన కృషిని, చేపట్టిన వినూత్న పథకాలను ఈ సందర్భంగా పోలీసు అధికారులు వివరించారు. హైదరాబాద్‌ నగరం సురక్షిత పట్టణంగా గుర్తింపు పొందడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలను సమర్దవంతంగా నిర్వహించిన తీరుపై కూడా పోలీసులు హోంమంత్రికి వివరించారు.

ఈ సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్త, అడిషనల్‌ డీజీపీ జితేందర్‌, కమిషనర్‌ అంజనీ కుమార్ , మహేశ్‌భగవత్,  సజ్జనార్‌ తదితరులు పాల్గొన్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu