మర్డర్ చిత్రం రిలీజ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

|

Nov 06, 2020 | 7:28 PM

తాజాగా శుక్రారం మర్డర్‌ చిత్రం విడుదలకు తెలంగాణ హైకోర్ట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సినిమా రిలీజ్‌పై నల్లగొండ కోర్టు ఇచ్చిన స్టేను… హైకోర్టు కొట్టేసింది. మర్డర్‌ సినిమాను విడుదల చేసుకోవచ్చని సూచించింది...

మర్డర్ చిత్రం రిలీజ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Follow us on

Green Signal For The Release Of Murder : మర్డర్ చిత్రం రిలీజ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ ఊపిరి పీల్చుకున్నారు. ఇదు అంశంపై ఆర్జీవీ స్పందించారు. తమ మంచి ఉద్దేశ్యాలను కోర్టు అర్థం చేసుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు శుక్రవారం ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. హైకోర్టు నుంచి ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత వివరాలు తెలియచేస్తామని, అందరికీ ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు.

మిర్యాలగూడకు చెందిన అమృత, ఆమె తండ్రి మారుతిరావుల కథ ఆధారంగా వర్మ కుటుంబ కథా చిత్రం ‘మర్డర్‌’అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే పలు పోస్టర్‌లు కూడా విడుదల చేశారు. ట్రైలర్ కూడా విడుదల అయ్యింది. ఇదే సమయంలో మర్డర్ చిత్రంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

ప్రణయ్ తండ్రి బాలస్వామి అభ్యంతరం వ్యక్తం చేస్తూ..తన కొడుకు హత్య కేసు కోర్టులో పెండింగ్ లో ఉండగా  చిత్రం తీస్తే.. సాక్షులు, బాధితులపై తీవ్ర ప్రభావం చూపుతుందని కోర్టుకు పిల్ వేశారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. బాలస్వామి సమర్పించిన సాక్ష్యాల ఆధారంగా.. వర్మపై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అయితే..తాజాగా శుక్రారం మర్డర్‌ చిత్రం విడుదలకు తెలంగాణ హైకోర్ట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సినిమా రిలీజ్‌పై నల్లగొండ కోర్టు ఇచ్చిన స్టేను… హైకోర్టు కొట్టేసింది. మర్డర్‌ సినిమాను విడుదల చేసుకోవచ్చని సూచించింది. అయితే మర్డర్‌ సినిమాలో ప్రణయ్‌, అమృతల అసలు పేర్లు వాడకూడదని హైకోర్టు షరతు విధించడంతో… చిత్ర యూనిట్‌ అంగీకారం తెలిపింది.