బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌కు హైకోర్టులో ఊరట..

| Edited By: Anil kumar poka

Jul 10, 2019 | 10:41 AM

కల్ట్‌ ఫిట్‌ హెల్త్‌కేర్‌ సంస్థ బ్రాండ్‌ అంబాసిడార్‌ బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌కు, ఆ సంస్థ ఉన్నతాధికారులకు హైకోర్టులో ఊరట లభించింది. కల్ట్‌ ఫిట్‌ సంస్థ మోసపూరిత ప్రకటనలు చేస్తోందని కూకట్ పల్లికి చెందిన ఐనేని శశికాంత్ ఆరోపించారు. ఆ సంస్థ ప్రకటనల ద్వారా ఆకర్షించి 1800 మందిని చేర్చుకుని వర్కవుట్ సెషన్స్‌లో చోటు కల్పించలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కంపెనీ ప్రతినిధులతోపాటు హృతిక్ పై కేసు నమోదు చేశారు. అయితే కేసును కొట్టివేయాలని […]

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌కు హైకోర్టులో ఊరట..
Follow us on

కల్ట్‌ ఫిట్‌ హెల్త్‌కేర్‌ సంస్థ బ్రాండ్‌ అంబాసిడార్‌ బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌కు, ఆ సంస్థ ఉన్నతాధికారులకు హైకోర్టులో ఊరట లభించింది. కల్ట్‌ ఫిట్‌ సంస్థ మోసపూరిత ప్రకటనలు చేస్తోందని కూకట్ పల్లికి చెందిన ఐనేని శశికాంత్ ఆరోపించారు. ఆ సంస్థ ప్రకటనల ద్వారా ఆకర్షించి 1800 మందిని చేర్చుకుని వర్కవుట్ సెషన్స్‌లో చోటు కల్పించలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కంపెనీ ప్రతినిధులతోపాటు హృతిక్ పై కేసు నమోదు చేశారు. అయితే కేసును కొట్టివేయాలని కోరుతూ హృతిక్‌తో పాటు కంపెనీ ప్రతినిధులు హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది. ఈ వ్యాజ్యాన్ని పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ గండికోట శ్రీదేవి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు.