తెలంగాణ ఎంసెట్, ఈసెట్ పరీక్ష షెడ్యూళ్స్ విడుదలయ్యాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య పాపిరెడ్డి ఈ షెడ్యూళ్లను రిలీజ్ చేశారు. ఈ సారి ఎంసెట్‌కు తెలంగాణలో 51 పరీక్షా కేంద్రాలు, ఏపీలో 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఎక్సామ్ ఫీజులో ఎస్సీ, ఎస్టీలతో పాటు దివ్యాంగులకు రాయితీలు కల్పించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.400/- కాగా.. ఇతరులకు రూ.500/-ల చొప్పున ఉంది. ఈడబ్ల్యూఎస్ అమలుకు ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతిరాలేదని.. ఎంసెట్ దరఖాస్తులో మాత్రం ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ ఉటుందని పాపిరెడ్డి తెలిపారు.
ఎంసెట్ షెడ్యూల్..
* ఈ నెల 19న ఎంసెట్ నోటిఫికేషన్
* ఈ నెల 21 నుంచి మార్చి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
* రూ.500ల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 6వరకు..
* రూ.1000/- ఆలస్య రుసుముతో ఏప్రిల్ 13 వరకు..
* రూ. 5000/- ఆలస్య రుసుముతో ఏప్రిల్ 20 వరకు..
* రూ.10,000/- ఆలస్య రుసుముతో ఏప్రిల్ 27 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.
ఇక మార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు దరఖాస్తులో సవరణలకు అవకాశం కల్పించనున్నారు. ఏప్రిల్ 20 నుంచి మే 1 వరకు హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక మే 4, 5, 7 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష ఉండగా.. మే 9, 11 తేదీల్లో ఎంసెట్ వ్యవసాయ, వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇక ఈసెట్ షెడ్యూల్ కూడా రిలీజ్ అయ్యింది.
ఈసెట్ షెడ్యూల్ వివరాలు
* ఈ నెల 24 నుంచి మార్చి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
* రూ.500ల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 8 వరకు..
* రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 18 వరకు …
* రూ5వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 25 వరకు..
* రూ. 10వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 28 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.
* మే 2న పరీక్ష