Telangana Corona Cases : రాష్ట్రంలో కొత్తగా 316 పాజిటివ్ కేసులు..యాక్టీవ్ కేసులు, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి

|

Dec 21, 2020 | 10:40 AM

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 316 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి మరో ఇద్దరు వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు.

Telangana Corona Cases : రాష్ట్రంలో కొత్తగా 316 పాజిటివ్ కేసులు..యాక్టీవ్ కేసులు, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి
Follow us on

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 316 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి మరో ఇద్దరు వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,81,730 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా… వైరస్‌తో ఇప్పటివరకు 1,515 మంది చనిపోయారు. ఆదివారం కొత్తగా వైరస్ నుంచి మరో 612 మంది బాధితులు కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,73,625 కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 6,590 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా… ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 4,467 మంది బాధితులున్నట్లు వైద్యారోగ్య శాఖ తాజా హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 86 కరోనా కేసులు నమోదయ్యాయి.

Also Read :

ఇంద్రపాలెం వద్ద విద్యుత్ తీగలు తగిలి కంటైనర్‌‌లో మంటలు.. 40 ద్విచక్రవాహనాలు అగ్నికి ఆహుతి

కమ్మేసిన మంచు దుప్పటి.. తెలంగాణలోని ఆ రెండు జిల్లాలపై చలి పంజా…ఈ సీజన్‌లోనే అత్యల్పం