India Corona Cases : భారత్‌లో కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చినట్లే కనిపిస్తుంది. కొత్తగా 8,96,236 మందికి కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేయగా, 16,375 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,03,56,844కు చేరింది. కొత్తగా 201 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడువగా..మొత్తం మరణాల సంఖ్య 1,49,850కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం రిలీజ్ చేసిన బులిటెన్‌లో పేర్కొంది. సోమవారం వ్యాధి బారి నుంచి 29,091 మంది కోలుకున్నారు. మొత్తంగా మహమ్మారిని జయించిన వారి సంఖ్య 99,75,958కు చేరింది. ప్రస్తుతం దేశంలో 2,31,036 యాక్టీవ్ కేసులున్నాయి.
పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ..జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలి తీవ్రత అధికంగా ఉన్నందున వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని సూచిస్తున్నారు.
Also Read :
భర్త స్నేహితుడితో సాన్నిహిత్యం..కట్టుకున్నవాడిని చంపించిన వైనం..గుత్తిలో దారుణం