విజయవాడ చేరుకున్న కేసీఆర్..వైసీపీ నేతల సాదర స్వాగతం

విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి తదితరులు ఘనస్వాగతం పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించడంతోపాటు విశాఖ శ్రీశారదాపీఠ ఉత్తరాధికారి శిష్య తురియాశ్రమ స్వీకార మహోత్సవంలో కేసీఆర్‌ పాల్గొంటారు. మరికాసేపట్లో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నివాసానికి కేసీఆర్ చేరుకుంటారు. అక్కడ  భోజనం చేస్తారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్‌ను కేసీఆర్‌ ఆహ్వానిస్తారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఏపీ […]

విజయవాడ చేరుకున్న కేసీఆర్..వైసీపీ నేతల సాదర స్వాగతం

Updated on: Jun 17, 2019 | 1:42 PM

విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి తదితరులు ఘనస్వాగతం పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించడంతోపాటు విశాఖ శ్రీశారదాపీఠ ఉత్తరాధికారి శిష్య తురియాశ్రమ స్వీకార మహోత్సవంలో కేసీఆర్‌ పాల్గొంటారు.

మరికాసేపట్లో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నివాసానికి కేసీఆర్ చేరుకుంటారు. అక్కడ  భోజనం చేస్తారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్‌ను కేసీఆర్‌ ఆహ్వానిస్తారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us