Telangana BJP: తెలంగాణ బీజేపీలో మరోసారి నామినేటెడ్ పోస్టుల వ్యవహారం తెరపైకి వచ్చింది. దీనిపై పోలీస్ కేసు కూడా నమోదు కావడంతో తీవ్ర కలకలం రేగింది. వివరాల్లోకి వెళ్తే.. నామినేటెడ్ పోస్టు ఇప్పిస్తానంటూ రూ.20 లక్షలు తీసుకుని మోసం చేశారని రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా ప్రెసిడెంట్ ఉమామహేశ్వరి రెడ్డిపై బీజేపీ యువమోర్చా స్టేట్ సెక్రటరీ బొక్కా బాల్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
Also Read: Temple Attacks In AP
స్పోర్ట్స్ అధారిటీ అఫ్ ఇండియా సెక్రటరీ పోస్టు ఇప్పిస్తానని సుమారు రూ.38 లక్షలు ఉమామహేశ్వరి రెడ్డి డిమాండ్ చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనితో ఆమెపై 420, 384, 406 సెక్షన్ల కింద రాజేంద్రనగర్ పోలీసులు కేసును నమోదు చేశారు.