Breaking News
  • గాంధీ ఆసుపత్రి హౌస్ ఫుల్. కరోనా కేసులతో నిండిపోయిన గాంధీ ఆసుపత్రి. గాంధీలో 163 మంది కరోనా లక్షణాలతో అడ్మిట్. 70 పాజిటివ్ కేసులకు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడిస్తున్న అధికారులు. నిండిపోయిన కేసులతో గాంధీలో వైద్యులు, సిబ్బందికి పెరిగిన పనిభారం.
  • గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై జరిగిన దాడిని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఖండించారు. అలాగే నిజామాబాద్‌లో వైద్య సిబ్బందిని అడ్డుకోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలిపారు కేటీఆర్‌. సంక్లిష్ట పరిస్థితుల్లో వైద్య సేవలను అందిస్తున్న వారిపై ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని ఊరికే వదలమని చెప్పారు.. తెలంగాణ ప్రభుత్వం ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తోందని ట్విట్టర్‌ ద్వారా తెలిపారు కేటీఆర్‌.
  • నల్లగొండ జిల్లాలో తొలిసారిగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నల్లగొండలో 5, మిర్యాలగూడలో ఒక కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో పరిస్థితిని కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ అధికారులతో సమీక్షించారు.
  • అమరావతిరాజధానిలో అందరికీ ఇళ్ల పథకం వర్తింపుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం. అందరికీ ఇళ్ల పథకం అమలు కోసం అవసరమైన పక్షంలో సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ మార్పులు చేర్పులు చేయాలంటూ ఉత్తర్వులు. సీఆర్డీఏ చట్టం పరిధిలోనే మాస్టర్ ప్లానులో మార్పులుండాలని స్పష్టీకరణ. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పథకం అమలు చేసేలా ప్రక్రియ ప్రారంభించాలని గుంటూరు, కృష్ణా కలెక్టర్లకు ఆదేశాలు.
  • కరోనా వైరస్ ను ఎదర్కోవడంలో అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ తీవ్రంగా విఫలమౌతున్నారని ఆరోపించారు డొమొక్రాట్ సీనియర్ నేత బెర్నీ సాండర్స్. ట్రంప్ అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రమాకర అధ్యక్షుడని ధ్వజమెత్తారు.

Temple Attacks In AP: ఏపీలో దేవాలయాలపై వరుస దాడులు..

Temple Attacks In AP, Temple Attacks In AP: ఏపీలో దేవాలయాలపై వరుస దాడులు..

Temple Attacks In AP: ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు కలకలం రేపుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా సూర్యారావుపాలెంలోని అమ్మవారి ఆలయ ముఖద్వారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో ఒక పక్కన అమ్మవారి జాతరకు ఏర్పాట్లు జరుగుతుండగా.. ఈ ఘటన చోటు చేసుకోవడంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎవరో తెలుసున్నవారే చేసి ఉండవచ్చునని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: AP Leads Chart In Private Investments

అలాగే శుక్రవారం తెల్లవారు జామున నెల్లూరు జిల్లాలో కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. బోగోలు మండలం కొండబిట్రగుంటలోని వేంకటేశ్వరస్వామి ఆలయ రథానికి దుండగులు నిప్పంటించారు. ఒక్కసారిగా పెద్ద మంట రాజుకోవడంతో రథం పూర్తిగా కాలిపోయింది. ఇక ఆ గ్రామానికి చెందిన రెండు వర్గాల ప్రజలు.. దానికి కారణం మీరంటే.. మీరంటూ గొడవకు దిగడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి పోలీసులు రంగంలోకి దిగి వారిని శాంతింపజేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ రెండు ఘటనలపై స్పందించారు. బాధ్యలు ఎవరైనా కూడా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

Related Tags