టీ కొట్టు యజమాని..అపరకుభేరుడు..!

|

Aug 10, 2019 | 7:16 PM

ఒకప్పుడు టీ అమ్మిన వ్యక్తి నేడు దేశానికి ప్రధాని అయ్యాడని అందరు చెబుతంటారు. ఆ మేరకు ప్రధాని నరేంద్రమోదీని చాయ్ వాలా అని కూడా అంటారు..ఇక మరో చాయ్ వాలా అపర కుభేరుడిగా పేరుతెచ్చుకున్నాడు. అతడే కేరళకు చెందిన చెందిన టీ కొట్టు యజమాని విజయన్.  పట్టుదలతో సాధిస్తే.. ఏదైనా సాధ్యమే అంటున్నారు విజయన్ దంపతులు. ప్రపంచ పర్యటన లక్షంగా గత 55 ఏళ్లుగా  టీ కొట్టు నిర్వహిస్తూ.. విదేశాలు చుట్టివచ్చిన 70 ఏళ్ల వృద్ధ దంపతులు […]

టీ కొట్టు యజమాని..అపరకుభేరుడు..!
Follow us on

ఒకప్పుడు టీ అమ్మిన వ్యక్తి నేడు దేశానికి ప్రధాని అయ్యాడని అందరు చెబుతంటారు. ఆ మేరకు ప్రధాని నరేంద్రమోదీని చాయ్ వాలా అని కూడా అంటారు..ఇక మరో చాయ్ వాలా అపర కుభేరుడిగా పేరుతెచ్చుకున్నాడు. అతడే కేరళకు చెందిన చెందిన టీ కొట్టు యజమాని విజయన్.  పట్టుదలతో సాధిస్తే.. ఏదైనా సాధ్యమే అంటున్నారు విజయన్ దంపతులు. ప్రపంచ పర్యటన లక్షంగా గత 55 ఏళ్లుగా  టీ కొట్టు నిర్వహిస్తూ.. విదేశాలు చుట్టివచ్చిన 70 ఏళ్ల వృద్ధ దంపతులు నిజమైన భారత కుభేరులు అంటూ ఏకంగా మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్రయే కితాబిచ్చారు. అసలు విజయన్ సాధించిన విజయం ఏంటో తెలుసా..?

కేరళ రాష్ట్రం కొచ్చిలోని గిరి నగర్ లో విజయన్ దంపతులది ఓ చిన్నా టీ స్టాల్.. వీరి చాయ్ ఎంతో అక్కడ బాగా ఫేమస్ అట. రోజు 350 మందికి క్యాటరింగ్ చేస్తారట. అయితే, విజయన్ కు దేశ విదేశాలు చుట్టి రావాలి అని తన చిన్ననాటి నుండి ఓ తీరని కల ఉండేదట. కానీ, అది డబ్బుతో కూడుకున్న పని ..కాబట్టి ఆ కల సాకారం కావాలంటే..నిలకడగా ఆదాయాన్నిఇచ్చే టీ వ్యాపారం మొదలు పెట్టారట.. ఇక వ్యాపారంతో పాటుగా తమ కలలను  నెరవేర్చుకునేందుకు వీరు రోజు 3 వందల రూపాయలు పొదుపు చేస్తూ వస్తున్నారట..అలా వచ్చిన సంపాదనలో తక్కువ మొత్తంలో ఖర్చులు పెడుతూ విదేశాలలో తిరుగుతారు. ఇప్పటికే సింగపూర్, అర్జెంటినా, స్విజర్లాండ్, బ్రెబిల్ సహా మొత్తం 23 దేశాలు చుట్టి వచ్చిన విజయన్ దంపతులు మరిన్ని దేశాలు చుట్టిరావాలనే యోచనలో ఉన్నారట. అందుకోసం ప్రణాళిక బద్దంగా పైసా పైసా కూడా బెడుతున్నారట. విజయన్ విజయ గాథ నిజంగా ఆదర్శనీయం కదా.. .!