ఆ ధైర్యం జగన్ కు ఉందా..? చినరాజప్ప ప్రతిదాడి

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వైసీపీ ప్రభుత్వంపై ప్రతిదాడికి దిగారు. వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న దారుణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే తాజాగా రాజధాని అమరావతి భూముల్లో..

ఆ ధైర్యం జగన్ కు ఉందా..? చినరాజప్ప ప్రతిదాడి

Updated on: Sep 15, 2020 | 4:50 PM

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వైసీపీ ప్రభుత్వంపై ప్రతిదాడికి దిగారు. వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న దారుణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే తాజాగా రాజధాని అమరావతి భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశాన్ని పాలకులు తెరపైకి తెచ్చారని విమర్శించారు. విశాఖపట్నంలో ప్రభుత్వం పెద్దఎత్తున కొనుగోలు చేసిన భూములపై ఎందుకు విచారణ జరపడం లేదని ఆయన ప్రశ్నించారు. టీడీపీపై బురదజల్లే కార్యక్రమాలు తప్ప, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేసిందేమీలేదని ఎద్దేవా చేశారు. సీఆర్డీఏ హద్దులకు ఆవలఉన్న ప్రాంతాల్లోని భూములను కూడా రాజధాని భూములని విషప్రచారం చేస్తున్నారని చినరాజప్ప ఆరోపించారు. విశాఖపట్నంలో ప్రభుత్వం కొనుగోలుచేసిన భూముల వ్యవహారంపై విచారణకు ఆదేశించే ధైర్యం ముఖ్యమంత్రి జగన్ కు ఉందా? అంటూ రివర్స్ ఛాలెంజ్ విసిరారు ఏపీ మాజీ హోం మంత్రి.

Loading...
Unable to load recommendations.
Follow Us