ప్రజల కింద అందరూ బంట్రోతులే : బాలకృష్ణ

గవర్నర్ ప్రసంగంలో కేవలం నవరత్నాల గురించి మాత్రమే ప్రస్తావించారంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ. చేతి వృత్తుల గురించి వదిలేశారన్నారు. కేవలం జలయజ్ఞం గురించి మాత్రమే మాట్లాడారని, అమరావతి నిర్మాణం గురించి ఎక్కడా మాట్లాడలేదని బాలకృష్ణ పెదవి విరిచారు. నిన్న అసెంబ్లీలో వైసీపీ నేతలు చేసిన విమర్శలపై ప్రజలు ఆలోచిస్తారన్నారు. మరో వైపు గవర్నర్ ప్రసంగానికి దశ, దిశ లేదని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ఆయన ప్రసంగం వైసీపీ ప్రచార పాంప్లెట్‌లా ఉందన్నారు. అసలు […]

ప్రజల కింద అందరూ బంట్రోతులే : బాలకృష్ణ

Edited By:

Updated on: Jun 14, 2019 | 2:49 PM

గవర్నర్ ప్రసంగంలో కేవలం నవరత్నాల గురించి మాత్రమే ప్రస్తావించారంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ. చేతి వృత్తుల గురించి వదిలేశారన్నారు. కేవలం జలయజ్ఞం గురించి మాత్రమే మాట్లాడారని, అమరావతి నిర్మాణం గురించి ఎక్కడా మాట్లాడలేదని బాలకృష్ణ పెదవి విరిచారు. నిన్న అసెంబ్లీలో వైసీపీ నేతలు చేసిన విమర్శలపై ప్రజలు ఆలోచిస్తారన్నారు.

మరో వైపు గవర్నర్ ప్రసంగానికి దశ, దిశ లేదని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ఆయన ప్రసంగం వైసీపీ ప్రచార పాంప్లెట్‌లా ఉందన్నారు. అసలు అమరావతి నిర్మాణం ఊసే లేదని, కనీసం నిరుద్యోగుల గురించి కూడా ఆయన ప్రస్తావించలేదన్నారు. వైసీపీ కార్యకర్తలను గ్రామ వాలంటీర్లుగా నియమించి, రూ.11 వేల కోట్లు దోచిపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు బుచ్చయ్య చౌదరి.

Follow Us