బ్రేకింగ్ న్యూస్ : జగన్ కోసం టీడీపీ నేతల వెయిటింగ్..!

మరికొన్ని గంటల్లోనే వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జగన్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ఆహ్వానించారు. అయితే.. ఆయన హాజరుకాకూడదని టీడీఎల్పీ సమావేశంలోనే నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా జగన్‌ను కలవాలని ముగ్గురు టీడీపీ నేతలు.. గంటా శ్రీనివాస్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌లను చంద్రబాబు పంపించారు. వారు కొద్దిసేపటి క్రితమే జగన్ వద్దకు బయలుదేరినట్టు తెలుస్తోంది. తమకు ఉదయం 11 గంటల్లోపు జగన్ అపాయింట్‌మెంట్ కావాలని వీరు కోరినట్టు తెలిసింది. కాకపోతే ఇంకా అపాయింట్‌మెంట్ […]

బ్రేకింగ్ న్యూస్ : జగన్ కోసం టీడీపీ నేతల వెయిటింగ్..!

Edited By:

Updated on: May 30, 2019 | 10:08 AM

మరికొన్ని గంటల్లోనే వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జగన్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ఆహ్వానించారు. అయితే.. ఆయన హాజరుకాకూడదని టీడీఎల్పీ సమావేశంలోనే నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా జగన్‌ను కలవాలని ముగ్గురు టీడీపీ నేతలు.. గంటా శ్రీనివాస్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌లను చంద్రబాబు పంపించారు. వారు కొద్దిసేపటి క్రితమే జగన్ వద్దకు బయలుదేరినట్టు తెలుస్తోంది. తమకు ఉదయం 11 గంటల్లోపు జగన్ అపాయింట్‌మెంట్ కావాలని వీరు కోరినట్టు తెలిసింది. కాకపోతే ఇంకా అపాయింట్‌మెంట్ ఖరారు కాలేదని సమాచారం.