Air India: ఎయిర్ ఇండియా కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO), మేనేజింగ్ డైరెక్టర్ ( MD)గా క్యాంప్‌బెల్ విల్సన్‌ను టాటా సన్స్ నియమించింది. ఇప్పుడు 50 ఏళ్ల క్యాంప్‌బెల్ విల్సన్ (Campbell Wilson) ఎయిర్ ఇండియా బాధ్యతలు చేపట్టనున్నారు. టాటా సన్స్ (Tata Sons)ప్రకారం.. విల్సన్‌కు విమానయాన పరిశ్రమలో 26 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో టాటా సన్స్ ఎయిర్ ఇండియా CEO, MD గా మాజీ టర్కిష్ ఎయిర్‌లైన్ చైర్మన్ ఇల్కర్ అయ్సీని నియమిస్తున్నట్లు ప్రకటించింది. అయితే కొన్ని వివాదాల కారణంగా ఆయన ఆ ఆఫర్‌ను తిరస్కరించారు.
26 సంవత్సరాల అనుభవం:
క్యాంప్‌బెల్ విల్సన్‌కు విమానయాన పరిశ్రమలో 26 ఏళ్ల అనుభవం ఉంది. అతను 1996లో న్యూజిలాండ్‌లోని సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత విల్సన్ కెనడా, హాంకాంగ్, జపాన్‌లలో SIAలో పనిచేశాడు. సింగపూర్‌కు తిరిగి వచ్చిన తర్వాత, ఇక్కడ అతను స్కూట్ వ్యవస్థాపక CEOగా నియామకం అయ్యాడు. విల్సన్ సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఆ తర్వాత 2020లో స్కూట్‌కి సీఈఓ అయ్యాడు.
టాటా సన్స్, ఎయిర్ ఇండియా ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. ఎయిరిండియాకు క్యాంప్‌బెల్‌ను స్వాగతిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. అతను అనేక అసైన్‌మెంట్‌లలో ప్రపంచ మార్కెట్‌లలో పనిచేసిన పరిశ్రమలో అనుభవజ్ఞుడు. అతని అనుభవం ఆసియాలో ఎయిర్‌లైన్ బ్రాండ్‌ను నిర్మించడంలో ఎయిర్ ఇండియాకు ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రపంచ స్థాయి విమానయాన సంస్థను నిర్మించడంలో అతనితో కలిసి పనిచేయాలని నేను ఎదురుచూస్తున్నాను అని అన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి