ఓబులాపురం గనుల సరిహద్దులపై తపాలా గణేష్ రియాక్షన్

|

Oct 19, 2020 | 2:22 PM

ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో సర్వే పై సంచలన వ్యాఖ్యలు చేశారు తపాలా గణేష్. గాలి జనార్దన రెడ్డి అక్రమాలపై కోర్టులో కేసు వేసిన తపాలా గణేష్.. సర్వే ఎప్పుడో పూర్తయిందని చెప్పారు. అయితే కేవలం సరిహద్దు రాళ్లు పెట్టడానికి పదేళ్లు టైం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. దీనికి రెండు రాష్ట్రాల అధికారులపై గాలి ఒత్తిడి చేసి రాళ్లు పాతకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నోసార్లు కోర్టులు అదేశించినప్పటికీ అధికారులు హద్దులు ప్రకటించడం లేదన్నారు. కానిస్టేబుల్ కొడుకులైన గాలి బ్రదర్స్ […]

ఓబులాపురం గనుల సరిహద్దులపై తపాలా గణేష్ రియాక్షన్
Follow us on

ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో సర్వే పై సంచలన వ్యాఖ్యలు చేశారు తపాలా గణేష్. గాలి జనార్దన రెడ్డి అక్రమాలపై కోర్టులో కేసు వేసిన తపాలా గణేష్.. సర్వే ఎప్పుడో పూర్తయిందని చెప్పారు. అయితే కేవలం సరిహద్దు రాళ్లు పెట్టడానికి పదేళ్లు టైం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. దీనికి రెండు రాష్ట్రాల అధికారులపై గాలి ఒత్తిడి చేసి రాళ్లు పాతకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నోసార్లు కోర్టులు అదేశించినప్పటికీ అధికారులు హద్దులు ప్రకటించడం లేదన్నారు. కానిస్టేబుల్ కొడుకులైన గాలి బ్రదర్స్ లక్షల టన్నుల ఐరన్ ఓర్ తవ్వేసారని ఇప్పటికీ వారి పెత్తనం సాగుతోందన్నారు. హద్దులు ప్రకటిస్తే చేసిన అరాచకం బయటకు వస్తోందన్న భయంతోనే గాలి రాజకీయ పలుకుబడితో ఇప్పటికీ అరాచకాలు చేస్తున్నారని తపాలా గణేష్ చెబుతున్నారు.