
తమిళనాడులో కరోనా వైరస్ రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. బుధవారం ఒక్కరోజే 1,927 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36,841కి చేరింది. ఇక కొవిడ్ చికిత్స పొంతున్నవారిలో ఇవాళ ఒక్కరోజే 19 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో.. తమిళనాడులో కరోనా మరణాల సంఖ్య 326కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులతో 17,179 మంది వివిధ అస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఇప్పటివరకూ 19,333 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కొత్త కేసుల నమోదుతో పాటు మరణాల సంఖ్య పెరుగుతుండడంతో కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకూ 6,09,856 మందికి టెస్ట్‌లు నిర్వహించారు. బుధవారం ఒక్కరోజే 16,667 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.