దేశంలో కరోనా కల్లోలం.. ఒక్క రోజే 16,922 కేసులు, 418 మరణాలు..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్ లో వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసుల సంఖ్య నమోదవుతుండటం ప్రజల్లో

దేశంలో కరోనా కల్లోలం.. ఒక్క రోజే 16,922 కేసులు, 418 మరణాలు..

Edited By:

Updated on: Jun 25, 2020 | 10:22 AM

Coronavirus In India: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్ లో వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసుల సంఖ్య నమోదవుతుండటం ప్రజల్లో కొంత ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం గడిచిన 24 గంటల్లో 16,922‬ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ‬418 కరోనా మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,73,105కి చేరుకుంది. ఇందులో 1,86,514‬ యాక్టివ్ కేసులు ఉండగా.. 14,476 మంది కరోనాతో మరణించారు. అటు 2,71,697 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో 13,012 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

[svt-event date=”25/06/2020,10:06AM” class=”svt-cd-green” ]

Also Read: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అగ్ని ప్రమాదం