ఇండియన్ ఫుడ్ అంటే తనకెంతో ఇష్టమని అంటున్నారు తైవాన్ ప్రెసిడెంట్ సాయ్ ఇంగ్ వెన్ ! తానేకాదు.. తమ దేశ ప్రజలు కూడా భారతీయ ఆహారాన్ని ఎంతో లైక్ చేస్తారని తెలిపారు. ముఖ్యంగా తనకైతే చనా మసాలా, నాన్ అంటే నోరూరిపోతుందట ! ఇక ఇండియన్ టీ అయితే చెప్పనక్కర్లేదు.. ఆ రుచే బ్రహ్మాండం అని పొగిడారు. తైవాన్ లో ఎన్నో ఇండియన్ రెస్టారెంట్లు ఉన్నాయని, వాటిలోని డిషెస్ దేని రుచి దానిదే అన్నారు. ఇందుకు తమ దేశం ఎంతో అదృష్టం చేసుకుందన్నారు.మెమొరీస్ ఆఫ్ ఎ వైబ్రెంట్, డైవర్స్ అండ్ కలర్ ఫుల్ కంట్రీ అన్నారామె. మీకు ఇండియన్ డిషెస్ లో ఏది నచ్చుతుంది అంటూ ట్వీట్ చేశారు. ఆగ్రాలోని తాజ్ మహల్ కట్టడాన్ని తాను విజిట్ చేసినప్పటి ఫోటోలను ఇంగ్ వెన్ షేర్ చేశారు. నమస్తే ! ఈ దేశ సంస్కృతి, ఇక్కడి ఆచారాలు తనకెంతో నచ్చాయని ఆమె పేర్కొన్నారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఎన్నికల్లో ఇంగ్ వెన్ మళ్ళీ ఘనవిజయం సాధించి తైవాన్ ప్రెసిడెంట్ అయ్యారు.,
#Taiwan is lucky to be home to many Indian restaurants, & Taiwanese people love them. I always go for chana masala and naan, while #chai always takes me back to my travels in #India, and memories of a vibrant, diverse & colourful country. What are your favourite Indian dishes? pic.twitter.com/IJbf5yZFLY
— 蔡英文 Tsai Ing-wen (@iingwen) October 15, 2020