సాహో బాటలోనే సైరా.. ఎన్ని కోట్ల నష్టమంటే?

|

Oct 27, 2019 | 5:54 PM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ మూడు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుని.. నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటివరకు మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం కొన్ని చోట్ల మాత్రం బ్రేక్ ఈవెన్ దగ్గరకు చేరుకోలేదని వినికిడి. తెలుగు రాష్ట్రాల్లో 110 కోట్ల మార్క్ షేర్‌ను అందుకున్న ‘సైరా’ 24వ రోజుకి కేవలం 6 లక్షల షేర్ మాత్రమే వసూల్ చేసింది. ఇప్పటివరకు మొత్తంగా 240 కోట్ల గ్రాస్.. రూ.142 కోట్ల […]

సాహో బాటలోనే సైరా.. ఎన్ని కోట్ల నష్టమంటే?
Follow us on

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ మూడు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుని.. నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటివరకు మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం కొన్ని చోట్ల మాత్రం బ్రేక్ ఈవెన్ దగ్గరకు చేరుకోలేదని వినికిడి. తెలుగు రాష్ట్రాల్లో 110 కోట్ల మార్క్ షేర్‌ను అందుకున్న ‘సైరా’ 24వ రోజుకి కేవలం 6 లక్షల షేర్ మాత్రమే వసూల్ చేసింది. ఇప్పటివరకు మొత్తంగా 240 కోట్ల గ్రాస్.. రూ.142 కోట్ల షేర్‌ను ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వసూల్ చేసిందని సమాచారం.

‘సైరా’ సినిమా తెలుగులో హిట్ అయింది. అది అందరికి తెలిసిన విషయమే. కానీ కొన్ని చోట్ల మాత్రం ఇంకా సేఫ్ జోన్‌కు రాలేదని తెలుస్తోంది. నైజాం, ఉత్తరాంధ్ర లాంటి ఏరియాల్లో లాభాలు వచ్చాయి తప్ప.. మిగిలిన చోట్ల నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. ఇక మిగిలిన భాషల్లో చూస్తే.. ‘సైరా నరసింహారెడ్డి’ దారుణంగా నిరాశ పరిచింది. ఓవర్సీస్ అయితే.. రూ.2.5 మిలియన్ మార్క్ దగ్గరే ఆగిపోయింది.

ఈ సినిమా హిందీలో కేవలం రూ.8 కోట్లు మాత్రం రాబట్టగలిగిందని వినికిడి. ‘సైరా’కు ‘వార్’ సినిమా గట్టి పోటీని ఇచ్చిందని చెప్పాలి. అటు తెలుగులో కూడా కొన్ని చోట్ల మాత్రమే సైరా విజయం అందుకునేలా కనిపిస్తోంది. ఇప్పటివరకు రూ.141 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం ఇంకా 47 కోట్లకు వెనకబడి ఉందట. ఏది ఏమైనా చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ఆఖరికి నిరాశనే మిగిల్చిందని చెప్పొచ్చు. ఇప్పటికే 24 రోజులు పూర్తి కావడంతో దాదాపు పూర్తి రన్  కంప్లీట్ అయిందనే చెప్పాలి.