‘వ్యాపారులకు కైలాస దేశం స్వాగతం పలుకుతోంది’..

వ్యాపారం కోసం వచ్చేవారికి కైలాస దేశం ఎప్పుడూ స్వాగతం పలుకుతుందని స్వామి నిత్యానంద వెల్లడించారు. తమ దేశంలో వ్యాపారాలు చేసుకునేందుకు వ్యాపారస్తులు ఆసక్తి చూపించడం మంచి పరిణామం అని అన్నారు.

వ్యాపారులకు కైలాస దేశం స్వాగతం పలుకుతోంది..

Updated on: Aug 24, 2020 | 1:45 AM

Madurai Business Man Letter: వ్యాపారం కోసం వచ్చేవారికి కైలాస దేశం ఎప్పుడూ స్వాగతం పలుకుతుందని స్వామి నిత్యానంద వెల్లడించారు. తమ దేశంలో వ్యాపారాలు చేసుకునేందుకు వ్యాపారస్తులు ఆసక్తి చూపించడం మంచి పరిణామం అని అన్నారు. ఇటీవల తమిళనాడులోని మధురై జిల్లాకు చెందిన టెంపుల్ సిటీ హోటల్స్ అధినేత కుమార్, శారదా షాపింగ్ మాల్స్ అధినేత ప్రకాష్ తమ వ్యాపారాలను కైలాస దేశంలో ప్రారంభించేందుకు అవకాశం ఇవ్వాలని స్వామి నిత్యానందకు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా ఆ లేఖపై స్పందిస్తూ నిత్యానంద పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. వ్యాపారస్తులకు కైలాస దేశం ఎప్పుడూ స్వాగతం పలుకుతుందని.. అలాంటివారికి ఖచ్చితంగా మా సహకారం ఉంటుందని నిత్యానంద స్పష్టం చేశారు. తమిళనాడులోని మధురై, కాంచిపురం, తిరువన్నామలై జిల్లా వాసులకు తొలి ప్రాధాన్యం ఉంటుందని ఆయన అన్నారు.

కాగా, రిజర్వు బ్యాంక్ ఆఫ్ కైలాస పేరిట ఈ మధ్యన సొంత బ్యాంకును ప్రారంభించిన నిత్యానంద.. వినాయక చవితి సందర్భంగా శనివారం ఆ బ్యాంక్‌కు చెందిన బంగారు నాణేలను విడుదల చేశారు. దీంతో కైలాస దేశంలో వ్యాపారాలు చేయడానికి తమిళనాడుకు చెందిన పలువురు వ్యాపారులు ఆసక్తిని కనబరుస్తున్నారు.