సుశాంత్ డెత్ మిస్టరీ త్వరలో వీడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ కేసులో సుశాంత్ డెత్ ఫోరెన్సిక్ రిపోర్టులను సమగ్రంగా అధ్యయనం చేసిన ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుల బృందం సోమవారం సీబీఐ అధికారులను కలిసి చర్చించింది. రెండు గంటలకు పైగా ఈ చర్చలు జరిగినట్టు సమాచారం.. ఈ బృందం తమ తాజా సమ్మరీ రిపోర్టును అధికారులకు సమర్పించింది. వీటిని సీబీఐ కూడా మరింత లోతుగా అధ్యయనం చేయనుంది. అటు-కూపర్ హాస్పిటల్ యాజమాన్యం వారి ఆటాప్సీ రిపోర్టును కూడా వారు స్టడీ చేస్తారని, సుశాంత్ మృతిలో అనుమానాస్పద అంశాలేవైనా ఉన్నాయా అన్న విషయాన్ని తేలుస్తారని అంటున్నారు.