హనీట్రాప్‌లో ఆశ్చర్యపోయే అంశాలు

|

Dec 21, 2019 | 4:07 PM

ఆపరేషన్ డాల్ఫిన్ నోస్‌లో ఆశ్చర్యపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. పలువురు నావికా దళ అధికారులను హనీట్రాప్ చేయడం ద్వారా మన దేశ సైనిక రహస్యాలను పాకిస్తాన్ నిఘా అధికారులు తెలుసుకున్న అంశంలో మరిన్ని అంశాలు వెల్లడయ్యాయి. గూఢచర్యంపై కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూపీ లాగుతున్నాయి. నావికాదళ సమాచారంతో పాటు హవాలా ద్వారా నగదు చేతులు మారినట్టు నిఘా వర్గాలకు కీలక ఆధారాలు లభించాయి. ఆపరేషన్ డాల్ఫిన్ నోస్‌లో అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశం వుందని నిఘా వర్గాలు […]

హనీట్రాప్‌లో ఆశ్చర్యపోయే అంశాలు
Follow us on

ఆపరేషన్ డాల్ఫిన్ నోస్‌లో ఆశ్చర్యపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. పలువురు నావికా దళ అధికారులను హనీట్రాప్ చేయడం ద్వారా మన దేశ సైనిక రహస్యాలను పాకిస్తాన్ నిఘా అధికారులు తెలుసుకున్న అంశంలో మరిన్ని అంశాలు వెల్లడయ్యాయి. గూఢచర్యంపై కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూపీ లాగుతున్నాయి. నావికాదళ సమాచారంతో పాటు హవాలా ద్వారా నగదు చేతులు మారినట్టు నిఘా వర్గాలకు కీలక ఆధారాలు లభించాయి.

ఆపరేషన్ డాల్ఫిన్ నోస్‌లో అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశం వుందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. సోషల్ మీడియా సైట్స్‌పై ఇంటెలిజెన్స్ నిఘా పెంచేందుకు సిద్దమవుతున్నారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ హనీట్రాప్ ఉచ్చులో ఇంకా ఎవరెవరు పడ్డారన్నదానిపై ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు అరెస్టు అయిన ఏడుగురితో పాటు మరింతమంది వివరాలను నిఘావర్గాలు కూపీలాగుతున్నాయి. 2001 సంవత్సరంలోనూ గూడచర్యం కేసులో ఇద్దరు నేవీ ఉద్యోగులు సహా ముగ్గురిని విశాఖ పోలీసులు గతంలోనే అరెస్టు చేశారు.

తాజాగా వెల్లడైన హనీట్రాప్ వివరాలు విశాఖ వాసులను నివ్వెర పరుస్తున్నాయి. ఈ ట్రాప్‌లో అసలు ఎంత మంది పడ్డారన్నది చర్చనీయాంశంగా మారింది. ఆడవారి ఫోటోలతో నేవి అధికారులను ట్రాప్ చేసి.. అవసరమైతే మనీ పంపించి నేవీ రహస్యాలను పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ తెలుసుకుందన్న విషయం పలువురిని షాక్‌కు గురిచేస్తోంది.