మహారాష్ట్ర గవర్నర్ పై పిటిషన్‌.. నేడు సుప్రీంలో విచారణ!

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారిపై కాంగ్రెస్, శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ఆదివారం ఉదయం 11:30 గంటలకు విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. దేవేంద్ర ఫడ్నవిస్‌ను నవంబర్ 23 న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానిస్తూ గవర్నర్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా వారు ఈ పార్టీలు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాయి.  జస్టిస్ ఎన్‌వి రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాల తో కూడిన బెంచ్ శివసేన, […]

మహారాష్ట్ర గవర్నర్ పై పిటిషన్‌.. నేడు సుప్రీంలో విచారణ!

Updated on: Nov 24, 2019 | 10:19 AM

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారిపై కాంగ్రెస్, శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ఆదివారం ఉదయం 11:30 గంటలకు విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. దేవేంద్ర ఫడ్నవిస్‌ను నవంబర్ 23 న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానిస్తూ గవర్నర్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా వారు ఈ పార్టీలు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాయి.  జస్టిస్ ఎన్‌వి రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాల తో కూడిన బెంచ్ శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ పార్టీల అభ్యర్ధనను విచారించనుంది.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని బిజెపికి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్‌కు మహారాష్ట్ర గవర్నర్ ఆహ్వానించడం, అయన చేత ప్రమాణం చేయించడం చట్టవిరుద్ధమని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై  కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా మాట్లాడుతూ, మూడు మిత్రపక్షాలు మెజారిటీని నిరూపించడానికి మహారాష్ట్ర అసెంబ్లీలో అత్యవసర  బల పరీక్షను డిమాండ్ చేశాయని కేసు రిజిస్ట్రీ, మా పిటిషన్ ను స్వీకరించిందని తెలిపారు. ఆదివారం ఉదయం 11:30 గంటలకు సుప్రీంకోర్టు ఈ విషయాన్ని విచారించనుంది. ప్రజాస్వామ్యం, చట్టం గెలుస్థాయి”అని రణదీప్ సుర్జేవాలా తెలిపారు.

డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్‌సిపి అజిత్ పవార్ మద్దతుతో దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో మహారాష్ట్రలో నెల రోజుల రాజకీయ ప్రతిష్టంభన శనివారం ఉదయం నాటకీయంగా ముగిసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us